
చిత్ర పరిశ్రమలో రాణించాలని, స్టార్ హీరో కావాలని ఎంతో మంది రంగుల ప్రపంచంలోకి అడుగుపెడతారు. కానీ, ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా అంతే ముఖ్యం. ఎంత కష్టపడినా కొందరికి సక్సెస్ దక్కదు. అలా దాదాపు 18 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగి, ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన ఒక నటుడు.. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నేడు కోట్లాది రూపాయలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అతను మరెవరో కాదు.. కునాల్ గోస్వామి.. ఈ పేరు మీకు అంతగా గుర్తులేకపోవచ్చు. కానీ నార్త్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో అలరించారు. కునాల్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు మనోజ్ కుమార్ కుమారుడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయనకు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు.
ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ
1981లో తన తండ్రి మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘క్రాంతి’ (Kranti) లో బాలనటుడిగా కునాల్ తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. 1983లో వచ్చిన ‘ఘుంగ్రూ’ సినిమాతో హీరోగా మారారు. అదే సంవత్సరంలో అతిలోక సుందరి శ్రీదేవి సరసన ‘కలాకార్’ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ, ఇందులో కునాల్‌పై చిత్రీకరించిన “నీలే నీలే అంబర్ పర్” అనే పాట ఇప్పటికీ ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత రిక్కీ (1986), ఆఖరి బాజీ (1989), పాప్ కీ కమాయ్ (1990), నంబ్రి ఆద్మీ (1991), విష్‌కన్య (1991) వంటి చిత్రాలలో నటించారు.
ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..
సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. తిరిగి 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలోనే వచ్చిన ‘జై హింద్’ (Jai Hind) సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో కునాల్ గోస్వామి చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. 2005లో ఆయన ‘రీతి’ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విజయవంతంగా ఒక ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారాన్ని (Catering Business) నడుపుతున్నారు. సినిమాల్లో రాణించలేకపోయినా, బిజినెస్‌లో మాత్రం మంచి లాభాలు ఆర్జిస్తూ లైఫ్‌లో సెటిల్ అయ్యారు.
ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
Kunal Goswami Pic
ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..