
సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన నటుల్లో ఇతను కూడా ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం ఈ స్టార్ హీరోకు వందల కోట్ల ఆస్తులున్నాయి. లగ్జరీ బంగ్లాలు, భవనాలు, కార్లు ఉన్నాయి. కానీ ఈ స్థాయికి రావడానికి ఈ నటుడు చాలా కష్టపడ్డాడు. అమ్మానాన్నలు కన్నుమూయడంతో 18 ఏళ్లకే రోడ్డున పడ్డాడు. మొదట తండ్రి క్యాన్సర్ తో కనుమూస్తే ఆ తర్వాత రెండేళ్లకు తల్లి కూడా మూత్రపిండాల జబ్బుతో ప్రాణాలు విడిచింది. దీనికి తోడు కొందరు సొంతింటిని ఆక్రమించుకోవడంతో రోడ్డున పడ్డాడు. చేతనైన పని చేస్తూ, దొరికింది తింటూ కడుపు నింపుకొన్నాడు. జీవనోపాధి కోసం ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాడు. బస్సుల్లో లిప్ స్టిక్ నెయిల్ పాలిష్ లు విక్రయించాడు. అలాగే ఒక ఫొటో ల్యాబ్‌లో కూడా పనిచేశాడు. అలా వచ్చిన డబ్బుతోనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతికాడు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ సినిమాలో అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. అంతే ఆ తర్వాత అతని జీవితమే మారిపోయింది. బాలీవుడ్ లో స్టార్ నటుడిగా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ నటుడి కామెడీకి తెలుగులోనూ చాలా మంది అభిమానులున్నారు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? మున్నా భాయ్ ఎంబీబీఎస్ ఫేమ్ అర్షద్ వార్సీ.
ఆ మధ్యన మన టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు అర్షద్ వార్సీ. ఈ వివాదం సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో అర్షద్ ఒకడు. మున్నా భాయ్ ఎంబీబీఎస్, హల్‌చల్, సలాం నమస్తే, జాలీ ఎల్‌ఎల్‌బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ వార్సీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమాలో అతను పోషించిన ‘సర్క్యూట్’ పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
ఇక అసుర్ 1, అసుర్ 2 వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స కు కూడా బాగా దగ్గరైపోయాడీ ట్యాలెంటెడ్ నటుడు. ప్రస్తుతం అర్షద్ వార్సీ చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.