Aishwarya Rai Bachchan : విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ తల్లిని ఎప్పుడైనా చూశారా ?..

|

Mar 24, 2024 | 5:09 PM

నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు 1994లో విశ్వసుందరిగా నిలిచారు. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైనవారిలో ఐశ్వర్య ఒకరని అంటుంటారు. నీలి కళ్లతో చంద్రబింబంలాంటి మోముతో ఎంతో అందంగా కనిపిస్తుంటారు. 50 ఏళ్ల వయసులోనూ నవతరం కథానాయికలకు పోటీనిచ్చేలా ఉంటారు. కానీ మీకు తెలుసా.. ఈ విశ్వసుందరి కన్నతల్లి కూడా అద్భుతమే. తన తల్లిదండ్రుల త్రోబ్యాక్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Aishwarya Rai Bachchan : విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ తల్లిని ఎప్పుడైనా చూశారా ?..
Aishwarya Rai
Follow us on

ఐశ్వర్యరాయ్ బచ్చన్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు 1994లో విశ్వసుందరిగా నిలిచారు. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైనవారిలో ఐశ్వర్య ఒకరని అంటుంటారు. నీలి కళ్లతో చంద్రబింబంలాంటి మోముతో ఎంతో అందంగా కనిపిస్తుంటారు. 50 ఏళ్ల వయసులోనూ నవతరం కథానాయికలకు పోటీనిచ్చేలా ఉంటారు. కానీ మీకు తెలుసా.. ఈ విశ్వసుందరికి కన్నతల్లి నుంచే అంతటి బ్యూటీ వచ్చింది . తన తల్లిదండ్రుల త్రోబ్యాక్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. అయితే అందులో ఐశ్వర్య తల్లి బృందారాయ్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. అందులో ఆమె తన కూతురు ఐశ్వర్య కంటే ఎంతో అందంగా.. మనోహరంగా కనిపిస్తున్నారు.

పట్టుచీరలో కలువ కన్నులకు మధ్యలో చందమామలాంటి బిందీ.. సింపుల్ బంగారు నగ ధరించి భారతీయ సంప్రదాయ పద్దతిలో గౌరవంగా కనిపిస్తున్నారు. ఐశ్వర్యకు ఆమె తల్లికి మధ్య పోలికలు ఎక్కువగానే ఉన్నాయి. ఐశ్వర్య కథానాయికగా అరంగేట్రం చేసిన తొలినాళ్లలో తన కూతురు వెంటే సినిమా సెట్‏కు వచ్చేది బృందరాయ్.

ఇక ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా తన తల్లిలాగే కనిపిస్తుంది. ఇటీవలే ఆమె స్కూల్లో జరిగిన వేడుకలో ఆరాధ్య ప్రత్యేకంగా ఓ ప్రదర్శన ఇచ్చింది. ఇన్నాళ్లు అమాయకంగా తల్లిచేతిని పట్టుకుని కనిపించే ఆరాధ్య.. స్టేజ్ పై మాత్రం తన సహజ నటనతో అదరగొట్టేసింది. ఇంగ్లీష్‏లో డైలాగ్స్ చెబుతూ.. సందర్భానుసారంగా ఆమె ఇచ్చిన హావాభావాలు చూసి అంతా షాకయ్యారు. దీంతో ఐశ్వర్య తర్వాత ఆరాధ్య సైతం మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.