Saif Ali Khan: స్టార్ హీరోకు నిద్రమాత్రలు వేసిన మాజీ భార్య.. ఎందుకో తెలిస్తే షాకే..

|

Jun 07, 2024 | 3:03 PM

ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సైఫ్ లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఒకప్పుడు సైఫ్ అలీ ఖాన్‏కు అతడి మాజీ భార్య అమృతా సింగ్ నిద్రమాత్రలు వేసిందట. అందుకు ఓ పెద్ద కారణమే ఉందని డైరెక్టర్ సూరజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సూరజ్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

Saif Ali Khan: స్టార్ హీరోకు నిద్రమాత్రలు వేసిన మాజీ భార్య.. ఎందుకో తెలిస్తే షాకే..
Sai Ali Khan
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఇన్నాళ్లు హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సైఫ్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేశారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో దక్షిణాది అడియన్స్ ముందుకు వచ్చిన సైఫ్.. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సైఫ్ లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఒకప్పుడు సైఫ్ అలీ ఖాన్‏కు అతడి మాజీ భార్య అమృతా సింగ్ నిద్రమాత్రలు వేసిందట. అందుకు ఓ పెద్ద కారణమే ఉందని డైరెక్టర్ సూరజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సూరజ్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

హిందీలో సైఫ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హమ్ సాత్ సాత్ హై సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రె, మోనిశ్ బాల్ ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ సూరజ్ బార్జాత్యా కలిసి నిర్మించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలకు అత్యధిక వ్యూస్ వస్తాయి. అయితే ఇందులో సునోజి దుల్హాన్ సాంగ్ షూటింగ్ సమయంలో సైఫ్ సరిగ్గా నటించలేదట. చాలా సార్లు రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడట. దీంతో సైఫ్ కు ఏమైందని అతడి భార్య అమృతాను అడగ్గా.. పగలు రాత్రీ తేడా లేకుండా మెళకువతో ఉంటూ వర్క్ చేయడం వల్లే అతడు అలసిపోయాడని.. దీంతో సరిగ్గా నటించలేకపోతున్నాడని చెప్పడంతో అతడికి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలని చెప్పాడట డైరెక్టర్ సూరజ్. దీంతో అతడికి నిద్రమాత్రలు ఇవ్వడంతో ఆ రోజంతా హాయిగా నిద్రపోయాడని.. మరుసటి సింగిల్ టేక్ లో పర్ఫెక్ట్ గా నటించాడని తెలిపాడు.

ఒక్క టేక్ లో ఎలా షాట్ పూర్తైందని తిరిగి సైఫ్ తనను ప్రశ్నించాడని.. దీంతో నువ్వు కంటి నిండా నిద్రపోతేనే సహజంగా నటించగలవని బదులిచ్చానని అన్నాడు డైరెక్టర్ సూరజ్. పెద్ద స్టార్స్ తో కలిసి నటించడం సైఫ్ కు అదే తొలిసారి కావడంతో చాలా టెన్షన్ గా ఉండేవాడని.. డైలాగ్స్ ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేశాడని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.