Jawan 2: అందరు మెచ్చిన ‘విక్రమ్ రాథోర్’ మళ్లీ రాబోతున్నాడు.. జవాన్ 2 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

|

Sep 17, 2023 | 4:57 PM

అట్లీ డైరెక్షన్.. షారుఖ్ యాక్టింగ్.. అనిరుధ్ సంగీతం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. ఈ ముగ్గురి కాంబోకు అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. కేవలం నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ షారుఖ్ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రూ.1000 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు. అయితే కొడుకు కంటే తండ్రిగా కనిపించిన విక్రమ్ రాథోర్ పాత్రకు

Jawan 2: అందరు మెచ్చిన విక్రమ్ రాథోర్ మళ్లీ రాబోతున్నాడు.. జవాన్ 2 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Jawan Movie
Follow us on

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద లెక్కలు సరిచేస్తున్నాడు షారుఖ్. ఇన్నాళ్లు వరుస డిజాస్టర్స్ అందుకుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పూర్వ వైభవం తీసుకువస్తున్నాడు. పఠాన్ సినిమాతో బీటౌన్ లో కొత్త ఆశలు కలిగించిన కింగ్.. ఇప్పుడు జవాన్ తో రికార్డ్స్ బద్దలుకొడుతున్నాడు. అట్లీ డైరెక్షన్.. షారుఖ్ యాక్టింగ్.. అనిరుధ్ సంగీతం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. ఈ ముగ్గురి కాంబోకు అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. కేవలం నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ షారుఖ్ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రూ.1000 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు. అయితే కొడుకు కంటే తండ్రిగా కనిపించిన విక్రమ్ రాథోర్ పాత్రకు మంచి స్పందన వచ్చింది.

విక్రమ్ రాథోర్ పాత్రకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ పాత్రతో మరికొంత కథ ఉంటే బాగుండేదని అంటున్నారు అడియన్స్. ఇప్పుడు అందరి కోరికనే నిజం చేసే పని తీసుకున్నారు డైరెక్టర్ అట్లీ. ఇటీవల ప్రెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. అటు ఈ మూవీ సీక్వెల్ పై మరింత బజ్ ఏర్పడింది. జవాన్ 2 ఉంటుందా ? లేదా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే విషయంపై డైరెక్టర్ అట్లీ స్పందిస్తూ జవాన్ 2పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇక అందరు అనుకున్నట్లే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కన్ఫార్మ్ చేశాడు. అలాగే ఈ సెకండ్ పార్ట్ ను విక్రమ్ రాథోర్ పాత్రతో డిజైన్ చేస్తామని చెప్పుకొచ్చాడు. జవాన్ రిలీజ్ తర్వాత ఎక్కువగా విక్రమ్ రాథోర్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ పాత్రతోనే పార్ట్ 2 రూపొందించేందుకు ప్లాన్ చేస్తామని అన్నారు. దీంతో జవాన్ 2పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడూ పట్టాలెక్కుతుందో చూడాలి.

మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. తొలిసారి షారుఖ్ సరసన కనిపించింది నయన్. అలాగే ఇందులో విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషించగా.. దీపికా పదుకొణే అతిథి పాత్రలో నటించింది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.