AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధూమ్‌-4 సీక్వెల్‌లో విలన్‌గా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి..? అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ఇక అభిమానులకు పండగే..

బాలీవుడ్‌లో వచ్చిన ధూమ్ సినిమాకు ఎంతటి క్రేజ్ దక్కిందో సినిమా అభిమానులందరికి తెలుసు. అందుకే ధూమ్ సీక్వెల్స్ వరుసగా ధూమ్-2,3 వచ్చాయి. ఈ సినిమాలు

ధూమ్‌-4 సీక్వెల్‌లో విలన్‌గా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి..? అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ఇక అభిమానులకు పండగే..
uppula Raju
|

Updated on: Feb 13, 2021 | 10:47 AM

Share

బాలీవుడ్‌లో వచ్చిన ధూమ్ సినిమాకు ఎంతటి క్రేజ్ దక్కిందో సినిమా అభిమానులందరికి తెలుసు. అందుకే ధూమ్ సీక్వెల్స్ వరుసగా ధూమ్-2,3 వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టడంలో పోటీ పడ్డాయంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ సినిమాలు యాక్షన్ సీన్స్‌తో బాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీక్వెల్‌-4 రాబోతుంది.

తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గత చిత్రాలకు భిన్నంగా సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు ‘ధూమ్‌ 4’లో ప్రతినాయకురాలి పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర చాలా ప్రత్యేకమైందని, అలాంటి వైవిధ్యభరిత పాత్రకు దీపికా పదుకొణె అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీపికతో చర్చలు జరిపారని, ఆమె స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంతోపాటు, కథానాయకుడు, దర్శకుల వివరాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్ చోప్రాతో కలిసి ‘ధూమ్‌’లో జాన్‌ అబ్రహాం, ‘ధూమ్‌ 2’లో హృతిక్‌ రోషన్‌, ‘ధూమ్‌ 3’లో ఆమీర్‌ ఖాన్‌ సందడి చేశారు. ప్రస్తుతం దీపిక చేతిలో ‘పఠాన్‌’, ‘83’ ‘మహాభారత్‌’ చిత్రాలున్నాయి.

Deepika Padukone : అవమానాలన్నీ ఛాలెంజ్‌‌‌‌‌‌‌గా తీసుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..