AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone : మరో వివాదంలో దీపికా పదుకొనే.. ఆ యాడ్‌పై ఫైర్ అవుతున్న లేడీ డైరెక్టర్.. కారణాలు ఇలా..

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనేను ఇటీవలే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న లెవిస్ జీన్స్.. కొత్తగా ఓ యాడ్ రిలీజ్ చేసింది. మ్యూజికల్ ట్రూప్‌తో

Deepika Padukone : మరో వివాదంలో దీపికా పదుకొనే.. ఆ యాడ్‌పై ఫైర్ అవుతున్న లేడీ డైరెక్టర్.. కారణాలు ఇలా..
uppula Raju
|

Updated on: Mar 04, 2021 | 8:30 PM

Share

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనేను ఇటీవలే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న లెవిస్ జీన్స్.. కొత్తగా ఓ యాడ్ రిలీజ్ చేసింది. మ్యూజికల్ ట్రూప్‌తో కలిసి దీపిక ఓ స్టూడియోలో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించిన ఈ యాడ్ వీడియో నెటిజన్లను అట్రాక్ట్ చేయగా.. ఈ విధంగా తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది లెవిస్. అయితే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘యె బెల్లెట్’ డైరెక్టర్ సూని తరపొరెవాలా మాత్రం ఈ యాడ్‌పై ఫైర్ అవుతూ ‘ఇది మేధోసంపత్తిని దొంగిలించడమే (ఇంటలెక్చువల్ థెఫ్ట్)’ అని పోస్ట్ పెట్టింది.

తమ సినిమా కోసం వేసిన డ్యాన్స్ స్టూడియో సెట్‌ను అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారని సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. ఇది గౌరవప్రదంగా లేదని, తమ అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనర్ షాల్జాయిడ్ సృజనాత్మకతను ఇలా దోచుకోవడం అన్యాయం అంటూ తన సినిమాకు సంబంధించిన సీన్‌తో పాటు లెవిస్ యాడ్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. కాగా లెవిస్ యాడ్ ప్రొడక్షన్ డిజైనర్ రూపిన్ సుచక్.. సినిమా, యాడ్‌ మధ్య పోలికలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. కానీ తాము యాడ్ డైరెక్టర్ చెప్పినట్లే చేశామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. కమర్షియల్ సినిమాలతో పాటు ఛాలెజింగ్‌ రోల్స్‌ కూడా చేస్తున్న దీపిక ఇమేజ్‌తో పాటు బ్రాండ్‌ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటున్నారు. రీసెంట్‌గా సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యూ పై చేసిన స్టడీలో ఫీమేల్‌ స్టార్స్‌లో టాప్‌ చైర్‌ నిలబెట్టుకున్నారు దీపిక. గత ఏడాది కూడా మోస్ట్‌ వాల్యుబుల్‌ ఫీమేల్‌ సెలబ్రిటీగా రికార్డ్‌ సెట్‌ చేసిన దీపికా.. ఈ ఏడాది కూడా తన ప్లేస్‌ కాపాడుకున్నారు. కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద భారీ ఇంపాక్ట్ చూపించినా దీపిక ఇన్‌కం మీద… ఏ మాత్రం నెగటివ్‌ షేడ్‌ పడలేదు. ఈ టైంలోనూ బ్రాండింగ్స్‌తో 50.4 మిలియన్‌ డాలర్స్‌ సంపాదించారు దీపిక పదుకొనే. గత ఏడాది దీపిక నటించిన ఒక్క సినిమా మాత్రమే థియేటర్లలోకి వచ్చింది. లాస్ట్ జనవరిలో ఛపాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ స్టార్ హీరోయిన్‌. అయితే సినిమాలు లేకపోయినప్పటికీ, బ్రాండింగ్‌లు మాత్రం తగ్గలేదు.

jerbara flowers:ఈ పూలతో లక్షల్లో లాభాలు.. మొక్కకు 25 పెడితే.. ఒక్కో పువ్వు ఎంత పలుకుతుందో తెలుసా..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్