Dadasaheb Phalke Birthday: నేడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతి.. మహిళలకి తొలిసారిగా సినిమాలలో అవకాశం కల్పించిన వ్యక్తి..!

|

Apr 30, 2022 | 8:03 AM

Dadasaheb Phalke Birthday: దాదాసాహెబ్ ఫాల్కే అంటే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. హిందీ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. నిజానికి

Dadasaheb Phalke Birthday: నేడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతి.. మహిళలకి తొలిసారిగా సినిమాలలో అవకాశం కల్పించిన వ్యక్తి..!
Dadasaheb Phalke
Follow us on

Dadasaheb Phalke Birthday: దాదాసాహెబ్ ఫాల్కే అంటే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. హిందీ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. నిజానికి ఆయన భారతదేశంలో సినిమాకి పునాది వేశారు. దాదాసాహెబ్ ఫాల్కే 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబాక్‌లో జన్మించారు. దాదాసాహెబ్ ఫాల్కే సృజనాత్మక కళాకారుడు. అతను స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి శిక్షణ తీసుకున్నాడు. అనుభవజ్ఞుడైన నటుడు. సినిమా లాంటి అసాధ్యమైన పని చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అతను బ్రాహ్మణ మరాఠీ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి నాసిక్‌కి చెందిన ప్రసిద్ధ పండితుడు. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఉపాధ్యాయుడు కూడా.

దాదాసాహెబ్ ఫాల్కే జర్మనీ నుంచి యంత్రాన్ని తెప్పించి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి మాసపత్రిక నడిపించాడు. దాదాసాహెబ్ తీసిన ఏకైక టాకీ చిత్రం పేరు ‘గంగావతరన్’. దాదాసాహెబ్ ఫాల్కే 1930లో సినిమా నిర్మాణాన్ని విడిచిపెట్టారు. దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ అనే పేరు పెట్టారు. అతని జన్మదినోత్సవం సందర్భంగా గూగుల్ తన డూడుల్‌ను రూపొందించి అతడిని గుర్తుచేసుకుంటుంది. అతను ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అని తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. 19 ఏళ్ల కెరీర్‌లో 95 సినిమాలు, 27 షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించాడు. ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా తీయడానికి తన భార్య నగలను కూడా తనఖా పెట్టాడు. ఇది మొదటి మూకీ చిత్రం.

దాదాసాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మాణానికి అప్పట్లోనే 15 వేల రూపాయల బడ్జెట్ ఖర్చు చేశారని చెప్పారు. ఆయన మహిళలకు సినిమాల్లో నటించే అవకాశం కల్పించారని బీబీసీ నివేదిక పేర్కొంది. అతని ‘భస్మాసుర్ మోహిని’ చిత్రంలో దుర్గ, కమల అనే ఇద్దరు మహిళలకు పని చేసే అవకాశం కల్పించాడు. దాదాసాహెబ్ ఫాల్కే చివరిగా తీసిన మూకీ చిత్రం ‘సేతుబంధన్’. అతను 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో మరణించాడు. భారతీయ చలనచిత్ర రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన చారిత్రక కృషికి గానూ భారత ప్రభుత్వం 1969 నుంచి ఆయన గౌరవార్థం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును ప్రారంభించింది. ఇది భారతీయ సినిమా అత్యున్నత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పరిగణిస్తారు. ఈ అవార్డును మొదట దేవికా రాణి చౌదరికి అందించారు.

ఇప్పటి వరకు చాలా మందికి ఈ గౌరవం దక్కింది

భారతీయ సినిమా అభివృద్ధికి చేసిన అపూర్వమైన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తారు. ఈ అవార్డులో స్వర్ణ కమలం, శాలువాతో పాటు రూ.10 లక్షలు అందజేస్తారు. ఇప్పటివరకు ఎందరో ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ అవార్డుతో సత్కరించారు.

మరిన్ని సినిమా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: సోదరి అత్తారింటికి వెళుతుంటే సోదరుడి భావోద్వేగం.. నెటిజన్ల హృదయాలని గెలిచిన వీడియో..!

Rohit Sharma Birthday: నేడు హిట్‌మ్యాన్‌ పుట్టినరోజు.. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనపై పెద్ద చర్చ..!

Kiwi Fruit: కివీ పండులో పోషకాలు పుష్కలం.. ఇలా ట్రై చేయండి..!