Rishabh Pant: ఆ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌!.. ఏకంగా 16 గంటలు వెయిటింగ్‌!..

మన దేశంలో సినిమా ఇండస్ట్రీకి- క్రికెట్‌కు అవినాభావ సంబంధం ఉంది. పలువురు స్టార్‌ క్రికెటర్లు బాలీవుడ్‌ భామలతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి హీరోయిన్లతో జీవితాన్ని పంచుకున్నారు.

Rishabh Pant: ఆ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌!.. ఏకంగా 16 గంటలు వెయిటింగ్‌!..
Rishabh Pant

Updated on: Mar 20, 2022 | 9:33 AM

మన దేశంలో సినిమా ఇండస్ట్రీకి- క్రికెట్‌కు అవినాభావ సంబంధం ఉంది. పలువురు స్టార్‌ క్రికెటర్లు బాలీవుడ్‌ భామలతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి హీరోయిన్లతో జీవితాన్ని పంచుకున్నారు. అనుష్కా శర్మ – విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్, సంగీత బిజ్లానీ – అజారుద్దీన్, జహీర్ ఖాన్ – సాగరిక, యువరాజ్ సింగ్‌ – హెజెల్ కీచ్, హర్భజన్ – గీతా బస్రా ఇలా సినిమా హీరోయిన్లతో ముడివేసుకున్న క్రికెటర్లు చాలానే ఉన్నారు. ఇప్పుడు మరో జంట ఈ జాబితాలోకి చేరింది. వారే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్- బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). గత కొన్ని రోజులుగా ఈ జోడీ ప్రేమలో మునిగితేలుతుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై అటు రిషభ్‌ పంత్ (Rishabh Pant) కానీ, ఇటు ఊర్వశి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రేమపక్షలకు సంబంధించి తాజాగా ఒక విషయం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. ఊర్వశిని కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురుచూశాడట.

గతంలోనూ..

వివరాల్లోకి వెళితే.. ఊర్వశి తన సినిమా షూటింగ్‌ కోసం ప్రస్తుతం వారణాసిలో ఉంటుందట. బిజీ షెడ్యూల్‌ ఉండడంతో ఆమెకు కాస్తైనా విశ్రాంతి దొరకడం లేదట. అప్పుడు ఊర్వశి వారణాసిలో ఉందని తెలుసుకున్న రిషబ్‌.. ఆమెను కలిసేందుకు ఆగమేఘాలపై అక్కడికి వెళ్లాడని తులస్తోంది. వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వెళ్లిన తర్వాత ఆమె కోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదట. దీంతో ఊర్వశి, రిషబ్‌ నిజంగా డేటింగ్‌లో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా బహిర్గతమయ్యేది కదా అని కొందరు అంటున్నారు. కాగా గతంలో ముంబైలోని జుహులోని ఒక హోటల్‏లో రిషబ్, ఉర్వశీ డిన్నర్ కోసం వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు రిషభ్‌ పంత్‌. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జట్టుకు ట్రోఫీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఊర్వశి విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది. త్వరలో బ్లాక్‌రోజ్‌ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించనుంది.

Also Read:Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. మీ ఖర్చు తగ్గుతుంది..

AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..

Gold Reserves: బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఎక్కువ ఉన్నాయి.. భారత్ కొత్తగా ఎంత గోల్డ్ కొందంటే..