Vidya Balan: డర్టీ పిక్చర్ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపిన విద్యాబాలన్

విద్యా చాలా చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది, కానీ 'ది డర్టీ పిక్చర్' ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. నేటికీ చాలా ప్రోగ్రామ్స్‌లో 'ఊ లా లా...' పాట ప్లే అవుతుంది. కానీ విద్యాబాలన్ సినిమా చేయడానికి అంగీకరించడంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందట. అయితే రెండో ఆలోచన లేకుండా విద్యా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 

Vidya Balan: డర్టీ పిక్చర్ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపిన విద్యాబాలన్
Vidya Balan

Updated on: Nov 28, 2023 | 6:41 PM

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్‌కి దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. విద్యా చాలా చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది, కానీ ‘ది డర్టీ పిక్చర్’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. నేటికీ చాలా ప్రోగ్రామ్స్‌లో ‘ఊ లా లా…’ పాట ప్లే అవుతుంది. కానీ విద్యాబాలన్ సినిమా చేయడానికి అంగీకరించడంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందట. అయితే రెండో ఆలోచన లేకుండా విద్యా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

‘ది డర్టీ పిక్చర్’ సినిమా గురించి విద్య బాలన్  మాట్లాడుతూ.. ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సినిమా విడుదలై చాలా ఏళ్లయింది. అయినా కూడా సినిమా షూటింగ్‌లో జరిగిన చాలా సంఘటనలను విద్యాబాలన్ మరచిపోలేకపోతోంది. విద్యాబాలన్ మాట్లాడుతూ, ‘సిల్క్ స్మిత పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పుడు నేను నమ్మలేకపోయాను. మొదట దర్శకుడు మిలన్ లూథ్రియా నా దగ్గరకు వచ్చాడు.కథ చెప్పినప్పుడు  ఈ పాత్రలో నటించే అవకాశం నాకు వస్తోందని నేను నమ్మలేకపోయాను అని తెలిపింది.

ఇంకా విద్యాబాలన్ మాట్లాడుతూ, ‘సినిమాలో ఒక పాత్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ చుట్టుపక్కల వారు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సినిమా చేస్తే మీ జీవితం, కెరీర్ నాశనం అవుతుందని కొందరు చెప్పారు..’ అని తెలిపింది. 2011లో ‘ది డర్టీ పిక్చర్’ సినిమా విడుదలైంది.  ‘ది డర్టీ పిక్చర్’లో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ కంటే ముందు చాలా మంది తిరస్కరించారు. కానీ ఆ ఒక్క సినిమా వల్ల విద్యాబాలన్ ఫేట్ మొత్తం మారిపోయింది. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.సినిమా విడుదలై చాలా ఏళ్లు గడిచినా అభిమానుల్లో సినిమా చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. విద్యాబాలన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటి తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.