Kangana Ranaut: కంగనాను కొట్టిన CISF మహిళకు అండగా మ్యూజిక్ డైరెక్టర్.. ఉద్యోగం ఇస్తానంటూ ఆఫర్..

|

Jun 07, 2024 | 4:31 PM

ఎందుకు అలా చేశావని అడిగితే గతంలో తాను రైతుల నిరసనలపై చేసిన వాఖ్యలపై ఆగ్రహంతో అలా దాడి చేసిందని చెప్పినట్లు తెలిపింది. అయితే కంగనా ఢిల్లీ చేరుకున్న అనంతరం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులను కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారి కుల్విందర్ కౌర్‏ను సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

Kangana Ranaut: కంగనాను కొట్టిన CISF మహిళకు అండగా మ్యూజిక్ డైరెక్టర్.. ఉద్యోగం ఇస్తానంటూ ఆఫర్..
Vishal Dadlani
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‏పై చంఢీగడ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమెను విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి. దీంతో తనపై జరిగిన ఘటనపై కంగనా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని.. సెక్యూరిటీ చెకింగ్ పూర్తైన తర్వాత సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తనవైపు వచ్చి చెంపదెబ్బ కొట్టిందని.. ఆ తర్వాత తనను దూషించిందని తెలిపింది. ఎందుకు అలా చేశావని అడిగితే గతంలో తాను రైతుల నిరసనలపై చేసిన వాఖ్యలపై ఆగ్రహంతో అలా దాడి చేసిందని చెప్పినట్లు తెలిపింది. అయితే కంగనా ఢిల్లీ చేరుకున్న అనంతరం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులను కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారి కుల్విందర్ కౌర్‏ను సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్విందర్ కౌర్‏కు మద్దతు తెలుపుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట్ర విశాల్ దద్లానీ. అలాగే ఆమెకు ఉద్యోగం కూడా ఇస్తానని అన్నారు. “నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ ఈ @official_cisf సిబ్బంది అయిన ఆ అమ్మాయి కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఆ తర్వాత సీఐఎఫ్ఎస్ సిబ్బంది అయిన కుల్విందర్ కౌర్‏కు సపోర్ట్ చేస్తూ మరిన్ని పోస్టులు చేశాడు విశాల్ దద్లానీ.

“కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎవరైనా ఆమెను సంప్రదించి నన్ను కంటాక్ట్ చేయండి. ఆమెకు ఉద్యోగం లభిస్తుందని నేను మాటిస్తున్నాను” అంటూ మరో పోస్ట్ చేశాడు. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలో కంగనా చేసిన పోస్టును షేర్ చేస్తూ.. “ఎవరైతే దుంగనా వైపు ఉన్నారో.. వాళ్ల అమ్మ కూడా రూ.100కే అందుబాటులో ఉందని ఆమె అంటే ఏం చేస్తారో..?” అంటూ ప్రశ్నించాడు. మరో పోస్టులో విశాల్ స్పందిస్తూ..” నేను మళ్లీ చెబుతున్నాను.. మిస్ కౌర్ ను విధుల్లో నుంచి తొలగిస్తే ఆమెను నాతో ఎవరైనా మాట్లాడించడి. ఆమెకు కచ్చితంగా ఉద్యోగం ఇస్తాను” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం విశాల్ దద్లానీ చేసిన వరుస పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.

Vishal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.