Suhana Khan: కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు 200కోట్లతో..

|

Apr 16, 2024 | 9:18 AM

పఠాన్, జవాన్, డంకి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు షారుఖ్. ఆ తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఆయన కూతురు కోసం రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది.

Suhana Khan: కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు 200కోట్లతో..
Suhana Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ 2023లో భారీ హిట్స్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు షారుక్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు షారుఖ్. ఆ తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఆయన కూతురు కోసం రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కింగ్ అనే సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను షారుఖ్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ పై పెద్ద వార్తలే వినిపిస్తున్నాయి. ‘కింగ్’ సినిమాపై షారుక్ ఖాన్ 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  ‘కింగ్’ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. షారూఖ్ కూతురు సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్‌పై నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే, ఇంతకుముందు సుహానా నటించిన ‘ది ఆర్చీస్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. తన కూతురు తొలిసారిగా వెండి తేర పై కనిపించనున్న సినిమా చాలా గ్రాండ్ గా ఉండాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నాడు. ఈ సినిమాలో షారుక్ కూడా నటిస్తున్నాడు.

షారుఖ్‌ ఖాన్‌కి కూడా ‘కింగ్‌’ సినిమా ప్రత్యేకం. ఎందుకంటే, ‘డంకీ’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘కింగ్’ సినిమాలో కనిపించనున్నాడు. కాబట్టి  ‘కింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకంగా నిలవాలని షారుక్ ఖాన్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు. ‘కింగ్’ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విదేశాల నుంచి స్టంట్ మాస్టర్లను రప్పించి యాక్షన్ సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని యాక్షన్ మూవీగా దీన్ని రూపొందించేందుకు ‘కింగ్’ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటుతుందని అంటున్నారు. షారూఖ్‌ఖాన్‌ ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.