బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు శివకుమార్ సుబ్రమణ్యం (Shiv Kumar Subramaniam) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. శివకుమార్ మరణ వార్త విని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే శివకుమార్ సుబ్రమణ్యం మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. 1989లో పరిందాతో రచయితగా కెరీర్ ప్రారంభించారు శివకుమార్ సుబ్రమణ్యం. ఆ తర్వాత అనేక సినిమాల్లో.. టెలివిజన్ షోలలో కనిపించారు. పరిందాలో జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, మాధురీ ధీక్షిత్ నానా పటేకర్, అనుపమ్ ఖేర్ వంటి తదితరులు నటించారు. ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు.
శివకుమార్ సుబ్రమణ్యం మరణంపై యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సుబ్రమణ్యం అంత్యక్రియలు సోమవారం ముంబైలోని మోక్షాధామ్ హిందూ శంషాంభూమ్ లో జరగనున్నాయి. శివకుమార్ సుబ్రమణ్యం స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్, 2 స్టేట్స్ లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా.. చాలా సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. చివరిసారిగా కరణ్ జోహర్ ప్రోడక్షన్ లో వచ్చిన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో ఆయన కనిపించారు. శివకుమార్ సుబ్రమణ్యం మరణ వార్త విని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
— Hansal Mehta (@mehtahansal) April 11, 2022
Gutted to hear this news. Incredibly tragic, esp as it happened just two months after the passing of his and Divya’s only child – Jahaan, taken by a brain tumour 2 weeks before his 16th birthday.
RIP #ShivkumarSubramaniam https://t.co/GkW6ATUhhN— beena sarwar (@beenasarwar) April 10, 2022
Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు