Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి.. సమన్లు జారీ చేసిన ముంబయి కోర్టు..

Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ సమయంలో శిల్పా పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శిల్పాశెట్టి మరో వివాదంలో...

Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి.. సమన్లు జారీ చేసిన ముంబయి కోర్టు..
Shilpa Shetty

Updated on: Feb 13, 2022 | 12:16 PM

Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ సమయంలో శిల్పా పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. రుణం తిరిగి చెల్లిందలేదన్న ఆరోపణలతో ముంబయిలోని అందేరీ కోర్టు శిల్పాశెట్టికి సమన్లు జారీ చేసింది. ఈ విషయమై శిల్పా శెట్టిని ఈ నెల 28న హాజరు కావాలని ముంబయి కోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారని సమాచారం. నిజానికి ఈ రుణాన్ని 2017 జనవరి నాటికి తిరిగి చెల్లిస్తానని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. అయితే సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్‌ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబయికి చెందిన వ్యాపార వేత్త పర్హద్‌ అమ్రా.. శుక్రవారం జుహూ పోలీస్‌ స్టేషన్‌లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పా సహా ఆమె తల్లి, సోదరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 28 శిల్పాశెట్టితో సహా తల్లి, సోదరిని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

Also Read: DU Exams 2022: ఓపెన్ బుక్‌ మోడ్‌లో సెసిస్టర్‌ పరీక్షలు.. సెంట్రల్‌ యూనివర్సిటీ కీలక నిర్ణయం!

చాణక్య నీతి: భార్యాభర్తల సంబంధం చిరకాలం ఉండాలంటే చాణక్య ఏం చెప్పాడో తెలుసా..?

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భూగర్భ సొరంగం..

Loading...
Unable to load recommendations.
Follow Us