Sara Ali Khan: వర్కౌట్ వీడియోతో వైరల్ అవుతున్న సారా.. అమ్మడి కసరత్తులకు కుర్రాళ్లకు చమట్లు పడుతున్నాయిగా..

|

Jul 22, 2022 | 8:47 PM

బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా 2018 లో వచ్చిన కేదార్‌నాథ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Sara Ali Khan: వర్కౌట్ వీడియోతో వైరల్ అవుతున్న సారా.. అమ్మడి కసరత్తులకు కుర్రాళ్లకు చమట్లు పడుతున్నాయిగా..
Sara Ali Khan
Follow us on

బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో సారా అలీఖాన్(Sara Ali Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా 2018 లో వచ్చిన కేదార్‌నాథ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సారా నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక తొలి సినిమా మంచి విజయం సాధించడంతో సారాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది ఈ పటౌడీ వారసురాలు. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాక ముందు చాలా లావుగా ఉండేది. ఇప్పటి సారాకు అప్పటి సారాకు అస్సలు పోలికే ఉండదు.. అంతలా ట్రాన్సఫామ్ అయ్యింది ఈ బ్యూటీ. చక్కనమ్మ చిక్కిన అందమే అనే సామెతకు సారా పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తోంది సారా.

ఇక ఈ అమ్మడు సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ రకరకాల ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి భామ. సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిత్యం జిమ్ లో చమట్లు చందిస్తూ శరీరాకృతిని అందముగా మలుచుకుంటూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడి వర్కౌట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు..  “తిరిగి రావడం మంచిగా అనిపిస్తోంది.. హాలిడే అయిపోయింది..మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశా.. మీరు కష్టపడి పని చేయాలి, సులభంగా హ్యాక్ చేయడం కుదరదు, పరిగెత్తండి- నిదానంగా ఉండటానికి సమయం లేదు. మీరు క్రాక్ చేయలేరు – కాబట్టి అటాక్ చేయండి”.! అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు అమ్మడి వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముద్దుగుమ్మ సారా కసరత్తుల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి