Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra: ఒక్కటైన ప్రేమజంట.. లీలా ప్యాలెస్‏లో వైభవంగా పరిణితి, రాఘవ్ వివాహం..

పరిణీతి, రాఘవ్ చద్ద పెళ్లికి దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. దిల్లీలో అర్దాస్ వేడుకతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈనెల 22న వధూవరుల కుటుంబాలు ఉదయ్ పూర్ చేరుకున్నాయి. అదే రోజు మెహందీ వేడుకతోపాటు సంగీత్ నిర్వహించారు.

Parineeti Chopra: ఒక్కటైన ప్రేమజంట.. లీలా ప్యాలెస్‏లో వైభవంగా పరిణితి, రాఘవ్ వివాహం..
Parineeti Chopra, Raghav Ch
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2023 | 9:53 PM

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‏లోని లీలా ప్యాలెస్‏లో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. పరిణీతి, రాఘవ్ చద్ద పెళ్లికి దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. దిల్లీలో అర్దాస్ వేడుకతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈనెల 22న వధూవరుల కుటుంబాలు ఉదయ్ పూర్ చేరుకున్నాయి. అదే రోజు మెహందీ వేడుకతోపాటు సంగీత్ నిర్వహించారు. పెళ్లి వేడుకను అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించాలని అతిథులకు మొబైల్ ఫోన్లను నిషేధించారు.  లీల్య ప్యాలెస్ సరస్సు మధ్యలో కళ్యాణ మండపం ఉంది. దంపతులు పడవలో మండపానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

వీరి పెళ్లికి పరిణితి కజిన్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరు కాలేదు. ఇప్పటికే అంగీకరించిన సినిమా షూటింగ్స్ ఉండడంతో ప్రియాంక రాలేకపోయినట్లుగా తెలుస్తోంది. పరిణితి, రాఘవ్ వివాహనికి మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్ మరియు భాగ్యశ్రీ వంటి స్టార్లు హజరయ్యారు. రిణీతి చోప్రా వివాహ దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా, రాఘవ్ చద్దా దుస్తులను ఆయన స్నేహితుడు ఫ్యాషన్ డిజైనర్ పవన్ మల్హోత్రా డిజైన్ చేశారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సెప్టెంబర్ 30న చండీగఢ్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

పరణీతి, రాఘవ్ చద్దా కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి బెస్ట్ ఫ్రెండ్స్. పరిణీతి కథానాయికగా రాణిస్తుండగా.. రాఘవ్ చద్దా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి పంజాబ్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వీక్షించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఈవెంట్స్ కు హజరుకావడంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.