Arjun Kapoor: ఆంటీతో ప్రేమ అన్న నెటిజన్స్‌కు అర్జున్ స్ట్రాంగ్ రిప్లై.. ఎవరి జీవితాలు వారివి..జీవించాలి.. జీవించనివ్వాలి అంటూ..

|

Jan 06, 2022 | 5:42 PM

Arjun Kapoor-Malaika: ప్రముఖ నిర్మాత బోనికపూర్ తనయుడు..బాలీవుడ్‌ యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌.. ఐటెం భామ మలైకా ప్రేమాయణం ఎప్పుడూ బీ టౌన్ లో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.  పెళ్లిపై, పిల్లలున్న..

Arjun Kapoor: ఆంటీతో ప్రేమ అన్న నెటిజన్స్‌కు అర్జున్ స్ట్రాంగ్ రిప్లై.. ఎవరి జీవితాలు వారివి..జీవించాలి.. జీవించనివ్వాలి అంటూ..
Arjun Kapoor Malaika Arora
Follow us on

Arjun Kapoor-Malaika: ప్రముఖ నిర్మాత బోనికపూర్ తనయుడు..బాలీవుడ్‌ యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌.. ఐటెం భామ మలైకా ప్రేమాయణం ఎప్పుడూ బీ టౌన్ లో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న 48 ఏళ్ల మలైకాతో అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. అర్జున్‌, మలైకా ఎప్పుడు, ఎక్కడా కనిపించినా ఈ జంట ఏజ్ డిఫరెన్స్ గురించి గుసగుసలు వినిపిస్తుంటాయి.  బీచ్‌లలో సన్ బాత్‌లు చేస్తూ… బ్లూ సీలో స్విమ్మింగులు చేస్తూ…హాయ్‌గా మలైకాతో టైమ్ చేస్తున్న అర్జున్ కపూర్‌కు తాజాగా షాకిచ్చారు ట్రోలర్స్. తన షేర్ చేసిన లేటెస్ట్ పిక్పై ఈ హీరో ఫాలోవర్సే విరుచుకుపడుతున్నారు. ఆంటీతో డేటింగ్ ఏంటి సిగ్గులేదా..! నీ కంటే వయస్సుల్లో 12 ఏళ్ల పెద్దదైన మలైకాతో ఆ ఆటలేంటి! ఇద్దరు పిల్లల తల్లితో నీకు రిలేషన్ అవసరమా! అంటూ సోషల్ మీడియా వేదికగా అర్జున్‌ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడాపై కొందరు ట్రోల్స్‌ చేస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి టోల్స్‌పై పెద్దగా స్పందించని అర్జున్‌ కపూర్‌ తాజాగా తన ఫాలోవర్స్ అండ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. “ఇలాంటి కామెంట్స్ పై స్పందించండి అని అడిగేది మీ మీడియా వారే.. అయినా కామెంట్స్ పెట్టేవారిలో సగం ఫేక్ అకౌంట్స్.. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి మాట్లాడేవాళ్లే.. నేను కనిపించినప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేస్తాను. అది నా హక్కు. నా పనికి గుర్తింపు లభిస్తే చాలు.. నా పర్సనల్ విషయాలు అనవసరం..” అంటూ గట్టిగా చెప్పేశాడు.

‘‘బంధాలకు సంబంధించిన విషయంలో వయోభేదాన్ని అడ్డుగా చూపొద్దు. ఎవరి వయసు ఎంత అనే దాని గురించి బాధపడకూడదు. ఎవరి జీవితాలు వారివి. జీవించాలి.. జీవించనివ్వాలి “వయస్సును చూసి ప్రేమించాలి అనేది నా దృష్టిలో వెర్రితనం.. నచ్చినవాళ్లతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పు లేదు” అంటూ కుర్రాళ్లకు తన హార్డ్‌ కోర్ ఫాలోవర్స్‌కు ప్రేమ గురించి తన ఆలోచన ఏమిటో చెప్పేశాడు బోనీ తనయుడు. వయోభేదం ఇబ్బంది ఏమీ కాదని, ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని వెల్లడించాడు.

అర్జున్ కపూర్  ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్ విలన్ రిటర్న్స్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం , తాగా సుటారియా, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇది 2014లో వచ్చిన ‘ఏక్‌ విలన్‌’  మూవీకి సీక్వెల్..

Also Read:  అమ్మ వీపే ఆ దివ్యాంగుడి ఆవాసం.. 26 ఏళ్ల కొడుకుని అన్నీ తానై సాకుతున్న తల్లి (photo gallery)