AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధురంధర్ 2పై విమర్శలు.. నెటిజన్స్ చేసిన పని ఇన్ స్టా గ్రామ్ డిలీట్

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ధురంధర్ 2 ది రివెంజ్. గతేడాది విడుదలైన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కేవలం ఐదు రోజుల్లోనే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ధురంధర్ 2పై విమర్శలు.. నెటిజన్స్ చేసిన పని ఇన్ స్టా గ్రామ్ డిలీట్
Dhurandhar
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2026 | 8:42 AM

Share

దేశవ్యాప్తంగా ధురంధర్ ది రివెంజ్ సినిమా దుమ్మురేపుతోంది. మార్చ్ 19న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. రోజులు గడుస్తున్నా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గడం లేదు. ఇప్పటికే వెయ్యికోట్ల మార్క్ ను దాటేసిన ఈ సినిమాకు ఇప్పటికీ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. గతేడాది విడుదలైన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కేవలం ఐదు రోజుల్లోనే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సీక్వెల్ ఒరిజినల్ చిత్రాన్ని అధిగమించడమే కాకుండా థియేటర్లలో భారీ తేడాతో వసూల్లు రాబడుతుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు.

ధురంధర్ ఫస్ట్ పార్ట్ దాదాపు 80 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయింది. ఇక ఇప్పుడు రెండవ భాగం రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా దాదాపు రెండు నెలలకు పైగా థియేటర్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ కొల్లగొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ధురంధర్ ది రివెంజ్ సినిమా పై కొందరు విమర్శలు కూడా చేశారు. మొన్నామధ్య ఓ కన్నడ హీరోయిన్ సినిమా చెత్తగా ఉందని కామెంట్స్ చేసింది.

అలాగే బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్‌ సీక్వెల్‌పై విమర్శలు చేసింది. ‘ది కేరళ స్టోరీ’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా ధురంధర్ 2 సినిమా తెరకెక్కించారు అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో నెటిజన్స్ ఆమె పై ఓ రేంజ్ లో ట్రోల్స్ కు దిగారు. సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమె ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేసింది. రీత్ పడ్డా వ్యక్తిగత విషయాలను కూడా నెటిజన్స్ ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us