Amitabh Bachchan: ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు అమితాబ్. వరుస సినిమాలతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపారు. ఇక ఇన్నేళ్ల తర్వాత కూడా బిజీ బిజీగా గడుపుతూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బి అమితాబ్, జయా బచ్చన్ సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 3, 1973) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ వేదికగా అమితాబ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లినాడు తీసిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోతోపాటు.. మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక అమితాబ్ చేసిన ఈ పోస్టుకు ఆయన అభిమానులు చేసిన కామెంట్లు వెల్లువెత్తాయి. భూమి పడ్నేకర్‌తో పాటు శిల్పాశెట్టి వంటి తారలు అమితాబ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇదే విషయమై అమితాబ్ తన బ్లాగ్‌లో అభిమానుంలదరికీ ధన్యవాదాలు తెలుపుతూ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. ఛెహ్రే, జూంద్, బ్రహ్మాస్త్ర, మేడే వంటి చిత్రాలతో సినీ అభిమానులతో పాటు కౌన్ బనేగా కరోడ్ పతి వంటి షోతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Gunasekhar: ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాను.. హీరోయిన్ పై డైరెక్టర్ ప్రశంసలు..