Akshay Kumar: బీ టౌన్‌కు ఆపద్భాంవుడిగా మారిన అక్కీ.. వరస సినిమాలతో ఖిలాడీ బిజిబిజీ

|

Mar 07, 2022 | 4:39 PM

Akshay Kumar: హిందీ ఇండస్ట్రీ అంతా ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు అంటున్నారు బాలీవుడ్(Bollywood) యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. సామజిక సేవ విషయంలోనే కాదు.. సినిమాలను తెరకెక్కించడంలో

Akshay Kumar: బీ టౌన్‌కు ఆపద్భాంవుడిగా మారిన అక్కీ.. వరస సినిమాలతో ఖిలాడీ బిజిబిజీ
Akshay Kumar
Follow us on

Akshay Kumar: హిందీ ఇండస్ట్రీ అంతా ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు అంటున్నారు బాలీవుడ్(Bollywood) యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. సామజిక సేవ విషయంలోనే కాదు.. సినిమాలను తెరకెక్కించడంలో కూడా నేను వెరీరీ స్పెషల్ అంటున్నాడు అక్కి..  బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న ఖాన్స్‌ కూడా మేకింగ్, రిలీజ్‌ల విషయంలో డైలామాలో ఉంటే… అక్షయ్‌ మాత్రం వరుసగా రిలీజ్‌లు.. అంతకన్నా బిజీగా షూట్‌లతో హల్ చల్ చేస్తూ.. బాలీవుడ్‌ స్క్రీన్‌కు ఆపద్భాందవుడిగా కనిపిస్తున్నారు. కోవిడ్ వైరస్(Corona Virus) వ్యాప్తి సమయం నుంచి ఒక్క సినిమా కంప్లీట్‌ చేయడానికి హీరోలు కిందామీద అవుతుంటే.. అక్షయ్‌ మాత్రం వరుసగా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు. మేకింగ్ విషయంలోనే కాదు.. రిలీజుల్లో కూడా ఈ ఖిలాడీ హీరో తెగ జోరు చూపిస్తున్నారు.

నేషనల్‌ లెవల్‌లో కోవిడ్ తరువాత నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన ఒకేఒక్క హీరోగా రికార్డ్ సృష్టించారు అక్షయ్‌ కుమార్‌. అంతేకాదు ఈ సిచ్యుయేషన్‌లోనే ఆరు సినిమాల షూటింగుల్లో పార్టిసిపేట్ చేస్తూ యంగ్ జనరేషన్‌లో జోష్ నింపుతున్నారు. కోవిడ్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనూ బెల్‌ బాటమ్‌, అత్రంగిరే సినిమాలు షూట్ చేసి రిలీజ్ చేశారు అక్కి. ఇప్పుడు బచ్చన్‌ పాండేగా ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళ బ్లాక్ బస్టర్‌ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో రఫ్‌ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నారు అక్షయ్‌. మాస్ ఎలివేషన్‌ని మరో లెవల్‌లో చూపిస్తున్న ఈ సినిమా మార్చి 18న రిలీజ్‌ అవుతోంది. ఈలోగా బాలీవుడ్‌లో విడుదల అయ్యే పెద్ద సినిమాలు  ఏవీ లేవు కనుక … నార్త్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సినిమా ఇదే అవుతుందన్న కాన్పిడెన్స్‌ మేకర్స్‌లో కనిపిస్తోంది.

Also Read:

కాందహార్‌ విమానం హైజాకర్లలో ఒకరు హత్య.. కరాచీలో ఘటన..