Sooryavanshi: బాలీవుడ్‌లో ‘సూర్యవంశీ’ సందడి.. ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ పెంచేసిన అక్షయ్ కుమార్ మూవీ

|

Nov 06, 2021 | 3:11 PM

Sooryavanshi Box Office Collections: 18 నెలల తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. కోవిడ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

Sooryavanshi: బాలీవుడ్‌లో ‘సూర్యవంశీ’ సందడి.. ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ పెంచేసిన అక్షయ్ కుమార్ మూవీ
Katrina Kaif, Akshay Kumar
Follow us on

Sooryavanshi Box Office Collections: 18 నెలల తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. కోవిడ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఈ టైమ్‌లో అందరి చూపు బాలీవుడ్ మాస్ యాక్షన్‌ మూవీ సూర్యవంశీ మీద ఉంది. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్‌ ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ తీసుకువచ్చింది. దాదాపు ఏడాదిన్నర తరువాత బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ కావటంతో థియేటర్లు హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్నాయి. తొలి రోజే 43 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సూర్యవంశీ ఇండియన్‌ సినిమాకు కొత్త జోష్ తీసుకువచ్చింది. బెల్‌ బాటమ్‌ రిలీజ్ టైమ్‌లో మహరాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతుండటంతో మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని చోట్ల 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. అందుకే సూర్యవంశీకి కనకవర్షం కురుస్తోంది.

సూర్యవంశీ సక్సెస్‌తో బాలీవుడ్‌కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ ఒక్క నెలలలోనే బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌ 500 కోట్లను టార్గెట్‌ చేస్తోందంటే అందుకు రీజన్‌ సూర్యవంశీ సినిమానే. ఆల్రెడీ ఈ మూవీ వంద కోట్ల మార్క్‌కు రీచ్ అయిపోయింది. నెక్ట్స్ బంటీ ఔర్ బబ్లీ 2, సత్యమేవ జయతే 2, అంతిమ్ లాంటి క్రేజీ మూవీస్ నవంబర్‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇవి కూడా మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. అందుకే భారీ వసూళ్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ జనాలు.

ఈనెలలో సూర్యవంశీ సోలోగానే 250 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందన్నది ట్రేడ్ పండితుల అంచనా. బంటీ ఔర్ బబ్లీ 2, సత్యమేవ జయతే 2 సూపర్ హిట్ సీక్వెల్స్‌ కాబట్టి ఆ సినిమాల మీద కూడా మంచి బజ్‌ ఉంది. ఇక సల్మాన్‌ గెస్ట్‌ రోల్‌లో నటించిన అంతిమ్‌కు ఆడియన్స్‌ నుంచి ఎలాగూ మంచి రెస్పాన్సే ఉంటుంది. ఈ సినిమాలన్నీ కలిపి 250 కోట్ల వరకు వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఎనలిస్ట్‌లు. అంటే ఓవరాల్‌గా నవంబర్‌ మార్కెట్‌ 500 కోట్ల పైనే అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌ నమ్మకం. అదే జరిగితే.. బాలీవుడ్‌కు మళ్లీ గోల్డెన్‌ డేస్ ప్రారంభమైనట్టే.

–  సతీష్, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..

Mega 154: మెగా 154వ ప్రాజెక్ట్ నుంచి మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం అంటున్న అభిమానులు..