
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురు ఆరాధ్య ఇటీవలే తన 14వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ స్టార్ కిడ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. బచ్చన్ ఫ్యామిలీలో ఈ మధ్యన బాగా హైలెట్ అవుతున్నది ఐశ్వర్య కూతురే. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆరాధ్య ఇప్పుడేం చదువుకుంటుందో తెలుసుకుందాం రండి.
బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లల్లో చాలా మంది ముంబై నగరంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతారు. ఇక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఈ స్కూల్‌లో చదువుతుంది. ఆరాధ్య నవంబర్ 16, 2011న జన్మించింది. ఆమెకు ఇప్పుడు 14 సంవత్సరాలు. ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుంది. ఆమెతో పాటు, ఇతర సెలబ్రిటీ పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుతున్నారు. ఆరాధ్య నర్సరీ నుంచి ఈ పాఠశాలలోనే చదువుతోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇక అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు లక్షల రూపాయలలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐశ్వర్య, అభిషేక్ లు తమ కుమార్తె చదువు కోసం ప్రతి నెలా రూ. 4.5 లక్షలు ఫీజు చెల్లిసస్తున్నారని టాక్.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు నెలకు దాదాపు రూ.1.70 లక్షలు వసూలు చేస్తుంది. ఆ తర్వాత, ఎనిమిదో తరగతి నుండి ఉన్నత పాఠశాల పూర్తయ్యే వరకు నెలకు రూ.4.5 లక్షలు వసూలు చేస్తుంది. ఫీజులకు తగ్గట్టుగానే ఈ పాఠశాలలో విద్యార్థులకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి. ఆరాధ్య తన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో చాలాసార్లు డ్యాన్స్ లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత సంవత్సరం, ఆరాధ్య షారుఖ్ ఖాన్ కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి వేదికపై ఒక నాటకాన్ని ప్రదర్శించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.