
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. కనికరం లేని ఉగ్రవాదులుపర్యాటకులను వారి పేర్లు, మతాలు అడిగి మరీ క్రూరంగా చంపడాన్ని భారతీయులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లు వెత్తుతున్నపాయి. భవిష్యత్తులో ఎవరూ భారతీయులపై ఇలాంటి దారుణాలకు పాల్పడటానికి సాహసించకుండా ఉండేందుకు ఉగ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయితే ఇప్పుడు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ప్రభావం వాణి కపూర్, ఫవాద్ ఖాన్ ల రాబోయే చిత్రం ‘అబీర్ గులాల్’ పై కూడా కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రతిచోటా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అబీర్ గులాల్’ ను బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అబీర్ గులాల్’ చిత్రంలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కానీ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా ‘అబీర్ గులాల్’ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఒక యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “పాకిస్తానీ కళాకారులను, వారి సినిమాలను బహిష్కరించండి… ఒకవైపు ఈ పాకిస్తానీయులు మన ప్రజలను చంపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ మాత్రం దాయాది వ్యక్తులతో సినిమాలు తీస్తుంది. అబీర్ గులాలాను బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. మరొక యూజర్, “అబీర్ గులాలాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడు. ఆ దేశ ఉగ్రవాదలు మన దేశ ప్రజలను చంపారు. ఫవాద్ ఖాన్ చిత్రం అబీర్ గులాలాను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని స్పందించాడు. కాగా ఫవాద్ తో కలిసి పనిచేసే వాణి కపూర్ పై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
why are Pakistani artists still being welcomed in Indian cinema while our soldiers are being martyred at the borders and innocent lives are being lost?
Dear makers: India isn’t a platform for selective amnesia! Don’t you get it?#BoycottPakiArtists #FawadKhan #AbirGulaal… pic.twitter.com/C14ylksJys
— Indian (@hind4hindus47) April 22, 2025
వాణి కపూర్, ఫవాద్ ఖాన్ జంటగా నటించిన ‘అబీర్ గులాల్’ చిత్రం మే 9న విడుదల కానుంది. కానీ ‘అబీర్ గులాల్’ సినిమాను వ్యతిరేకిస్తున్న తీరు చూస్తే, సినిమా సమస్యలు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ప్రజలు ఇప్పటికే అబిర్ గులాలాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ ఈ దాడి తర్వాత, ఈ నిరసన మరింత తీవ్రమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి