Rani Mukerji: స్టార్ హీరోయిన్ జీవితంలో అంతటి విషాదమా.. ఏడేళ్లుగా బయటకు చెప్పలేని నరకం..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ జీవితంలో ఉన్న విషాదం గురించి బయటపెట్టింది. ఏడేళ్లుగా తాను మనసులో మోస్తున్న బాధను వెల్లడించింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదని.. తన మొదటి బిడ్డకు తోబుట్టువులను ఇవ్వలేకపోయాయనే బాధ ఎప్పటికీ ఉంటుందని చెప్పుకొచ్చింది. గలాటకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మానసిక వేదన గురించి.

Rani Mukerji: స్టార్ హీరోయిన్ జీవితంలో అంతటి విషాదమా.. ఏడేళ్లుగా బయటకు చెప్పలేని నరకం..
Rani Mukerji

Updated on: Mar 22, 2024 | 8:26 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరు రాణి ముఖర్జీ. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ జీవితంలో ఉన్న విషాదం గురించి బయటపెట్టింది. ఏడేళ్లుగా తాను మనసులో మోస్తున్న బాధను వెల్లడించింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదని.. తన మొదటి బిడ్డకు తోబుట్టువులను ఇవ్వలేకపోయాయనే బాధ ఎప్పటికీ ఉంటుందని చెప్పుకొచ్చింది. గలాటకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మానసిక వేదన గురించి.. అలాగే తన కూతురు గురించి తెలిపింది. లాక్ డౌన్ సమయంలో తాను మరో బిడ్డను కోల్పోయానని.. ఇక ఇప్పుడు తనకు మరో బిడ్డ పుట్టే అవకాశం లేదని తెలిపింది.

“నేను రెండవ బిడ్డ కోసం ఏడేళ్లు ప్రయత్నించాను. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నేను రెండవ బిడ్డ కోసం ప్రయత్నించాను.. కానీ కుదరలేదు. 2020లో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయాను. బిడ్డను పోగొట్టుకోవడం.. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తోంది. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనలేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను. నా కూతురు అధిర మిరాకిల్ చైల్డ్.. ఆమెతో ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటాను.. ఇప్పుడు నాకు నా కూతురు అధిర ఒక్కరు చాలు” అంటూ చెప్పుకొచ్చింది.

2014లో రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాణీ ముఖర్జీ హలో బ్రదర్, హర్ ది జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై వంటి అనేక చిత్రాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.