బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) పెళ్లి గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరు ఈనెలలో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కోడుతున్నాయి. ఏప్రిల్ 14న వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని.. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అలియా.. రణబీర్ స్పందించలేదు. ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఇద్దరూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే తాజాగా మొదటిసారి అలియా భట్ తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై స్పంధించింది.
ప్రముఖ యూట్యూబర్ బియోనిక్ తన ఇన్ స్టాలో అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి గురించి ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో అలియా వెడ్స్, రణబీర్ అని రాసి ఉన్న కారు వెనక రోడ్డుపై చెప్పులు లేకుండా పరిగెడుతున్నాడు. అంతేకాకుండా.. బియోనిక్ తోపాటు.. అలియా భట్ ఉన్న ఫోటోలో.. అతని స్థానంలోకి రణబీర్ వచ్చినట్లుగా ఆ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 17 అంటూ హార్డ్ బ్రేక్ సింబల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన అలియా డెడ్ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. దీంతో అలియా.. తన వివాహన్ని దృవికరించిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్, గంగూబాయి కతియవాడి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది అలియా.. వీరిద్దరు కలిసి నటించిన బ్రహ్మస్త్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏప్రిల్ 14న అలియా రణబీర్ వివాహం జరగనుంది. ఈ వేడకకు కేవలం కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. చిత్రనిర్మాతలు కరణ్ జోహార్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వంటి వారు పాల్గోననున్నారు. ఆతర్వాత తాజ్ మహల్ ప్యాలెస్ లో ఏప్రిల్ 17న వీరి వివాహ రిసెప్షన్ అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.
Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు