బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మణిరత్నం, ఐశ్యర్యా రాయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పీరియడ్ డ్రామాలో విక్రమ్, జయం రవి, ప్రకాష్ రాజ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే తాజాగా ఈ మూవీ లోకేషన్ నుంచి ఐశ్వర్యారాయ్‌కు చెందిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లీక్ అయిన ఫోటోలో ఐష్ ఎరుపు రంగు చీరలో కనిపిస్తుంది. అంతేకాదు.. చీరకు తగ్గట్టుగానే భారీ ఆభరణాలతో అలకరించుకుని కనిపిస్తోంది. ఇంకా ఆమె చుట్టూ చాలా మంది ఉన్నారు. ఐష్ ఇందులో నందిని, మందాకిని దేవి అనే ద్విపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా లీకైన ఐష్ ఫోటో చూస్తుంటే బాహుబలిలో శివగామి రేంజ్లో పాత్ర ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మధ్యప్రదేశ్‌లో జరుగుతుంది. ఈ పీఈ పీరియడ్ డ్రామా కల్కి కృష్ణమూర్తి ప్రముఖ చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీరియడ్ డ్రామాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ట్వీట్..
Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన సామ్..