Sanjay Dutt: సెట్‌లో పేలిన బాంబ్.. తీవ్రంగా గాయపడిన సంజయ్ దత్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ లో గాయపడ్డారు. సినిమా సెట్ లో బాంబు పేలడంతో సంజయ్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కన్నడ చిత్రం 'కెడి' సెట్స్‌లో జరిగింది.
సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం కామనే. ఇటీవల షూటింగ్స్ లో చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఆర్టిస్ట్ లు గాయపడ్డారు కూడా.. తాజాగా మరో నటుడు షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ లో గాయపడ్డారు. సినిమా సెట్ లో బాంబు పేలడంతో సంజయ్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కన్నడ చిత్రం ‘కెడి’ సెట్స్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో సంజయ్ కు చేతి, మోచేయి, ముఖంపై గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తలరించారు అక్కడి వారు.
ఫైట్ మాస్టర్ రవి వర్మ సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో షూటింగ్‌లో వినియోగించేందుకు ఉంచిన బాంబు ఒక్కసారిగా పేలింది. దాంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి మెప్పించారు సంజయ్. ఇప్పుడు మరో కన్నడ సినిమాలో చేస్తున్నారు. షూటింగ్ లో సంజయ్ గాయపడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.