Aamir Khan: నేను చనిపోయిన సినిమా మాత్రం ఆపొద్దు.. ఆమిర్ ఖాన్ సీక్రెట్ నోట్
బాలీవుడ్ స్టార్ హీరో , మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఈ స్టార్ హీరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆమిర్ ఖాన్ సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాగే సినిమాలు కూడా థియేటర్స్ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన సినిమా విడుదలైందంటే హిట్ అవ్వడమే కాదు.. కోట్లల్లో కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆమిర్ ఖాన్ సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. విభిన్న కంటెంట్ చిత్రాలతో టాప్ హీరోగా నిలిచిన ఆయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయారు. రెండు సార్లు పెళ్లి.. రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు ఆమిర్ ఖాన్.. అలాగే మూడోసారి ప్రేమలో పడ్డాడు ఆమిర్ . కాగా ఇప్పుడు ఆమిర్ ఖాన్ కు సబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి విమాన ప్రయాణానికి ముందు తన సోదరుడు మన్సూర్ ఖాన్‌కు సీక్రెట్ నోట్ పంపుతా అని తెలిపారు. ఆ విమాన ప్రయాణంలో తనకు ఏదైనా జరిగితే విడుదలకు సిద్ధంగా ఉన్న తన సినిమాలను ఆపొద్దు అని మెసేజ్ పంపుతా అని తెలిపారు ఆమిర్ ఖాన్. “ఏదైనా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు నేను ప్లైట్ లో ట్రావెల్ చేయాల్సి వస్తే .. ఖచ్చితంగా మన్సూర్‌కు ఓ సీక్రెట్ నోట్ రాస్తా..
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
‘ఒకవేళ ఈ విమానంకు ఏదైనా ప్రమాదం జరిగిన, కూలిపోయి నేను చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వు చూసుకో’ అని నోట్ సెండ్ చేస్తాను. అలాగే దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతాను. నాకు ఏమైనా అయినా సినిమాను ఆపేయొద్దని.. మన్సూర్ తో కలిసి ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని కోరుతా అని ఆమిర్ తెలిపారు. మన్సూర్ ఖాన్ ఆమిర్ ఖాన్ ను బంధువు అవుతాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
