పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఇక ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడిని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ ను ఎంపిక చేశారు క్రిష్. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బాబీ డియోల్ ఇటీవల వచ్చిన ఆశ్రమం అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లో అతంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.
BOBBY DEOL JOINS PAWAN KALYAN FOR PAN-INDIA FILM… #BobbyDeol joins the cast of PAN-#India film #HariHaraVeeraMallu… Stars #PawanKalyan in title role… Directed by #Krish… Produced by #ADayakarRao… Summer 2023 release in #Telugu, #Hindi, #Tamil, #Kannada and #Malayalam. pic.twitter.com/wQQjJCLi1O
— taran adarsh (@taran_adarsh) December 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..