
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కుటుంబం అంతా సందడిగా గడుపుతున్నారు. మూడు రోజుల ఉత్సవాల్లో రిహన్న, బిల్ గేట్స్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.

ఇంకా అంబానీ కుటుంబం నిర్వహించే విభిన్న కార్యక్రమాల కోసం వివిధ వేదికలను సిద్దం చేశారు ఆర్గనైజర్స్. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. మార్చి 1 నుంచి 3 మధ్య గొప్ప కార్యక్రమాలను నిర్వహించారు. సరైన సెట్టింగ్‌ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

నీతా మరియు ముఖేష్ అంబానీలు నిర్వహించే ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలకు కేవలం క్యాటరింగ్ కాంట్రాక్ట్‌తో £120 మిలియన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు ₹ 1260 కోట్లు ఖర్చయ్యాయి.

ఇది భారతదేశంలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గ్రూపులలో ఒకటదానిని బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 20 మిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు.

అలియా భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు. కరీనా కపూర్ కూడా తన భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి విచ్చేశారు. రజినీకాంత్ ఫ్యామిలీ, ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తోపాటు కుమార్తె కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. షారుఖ్, సైఫ్ అలీఖాన్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ హాజరయ్యారు.