Happy Holi 2021:హోలీ శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ సెలబ్రెటీస్.. మోస్ట్ వైరల్‏గా అమితాబ్ ఫోటో..

Holi 2021: హోలీ.. రంగులను వేదజల్లుకునే పండగ.. భారతీయ పురాణాల్లో హోలీ వెనుకగా ఎన్నో కథలున్నాయి. మార్చి 29న హోలీ పండగ

Happy Holi 2021:హోలీ శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ సెలబ్రెటీస్.. మోస్ట్ వైరల్‏గా అమితాబ్ ఫోటో..
Bollywood Celebrities

Updated on: Mar 29, 2021 | 12:26 PM

Holi 2021: హోలీ.. రంగులను వేదజల్లుకునే పండగ.. భారతీయ పురాణాల్లో హోలీ వెనుకగా ఎన్నో కథలున్నాయి. మార్చి 29న హోలీ పండగ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. హోలీ జరుపుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‏గా మారింది. అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, కంగానా, రానా దగ్గుబాటి ఇలా పలువురు సెలబ్రెటీలు విష్ చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతున్నా… కానీ కోవిడ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గిన కేసులు ఇటీవలే రికార్డు స్థాయిలో నమోదవుతుండడం కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అలాగే ప్రజలందరూ.. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

Also Read:

Holi 2021: పెళ్ళి తర్వాత వచ్చే ప్రతి పండుగ ప్రత్యేకమైనదే.. హోలీ సంబరాలను ప్లాన్ చేసుకున్న చందమామ..