ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందమే.. ఫెంటాస్టిక్ యాక్టర్ అంటూ కితాబిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్.. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. పాత్రకు అనుగుణంగా
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్.. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. పాత్రకు అనుగుణంగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ వంద శాతం న్యాయం చేస్తుందనడంలో సందేహం లేదు. ‘దమ్ లగా కే హైషా’ చిత్రంలో తన పాత్ర కోసం బరువు పెరిగిన భూమి.. ఆ తర్వాత వచ్చిన సామాజిక సందేశాత్మక చిత్రం ‘టాయిలెట్: ఏక్ ప్రేమ కథ’ కోసం దాదాపు 21 కిలోల బరువు తగ్గింది. ఇది ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనం కాగా, ప్రస్తుతం భూమి హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో వస్తున్న ‘బదాయి హో’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో తొలిసారి రాజ్ కుమార్ రావు-భూమి పెడ్నేకర్ జోడీగా కనిపించబోతున్నారు.
2018లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ‘బదాయి హో’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టైటిల్‌తో హర్షవర్ధన్ డైరెక్షన్‌లో రాజ్‌కుమార్‌రావు భూమిపెడ్నేకర్ హీరో హీరోయిన్లుగా చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముస్సోరిలో జరుగుతోంది. కాగా, తొలిసారి రాజ్ కుమార్ రావుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని, ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్ అని భూమి ప్రశంసించింది. ఇక భూమి గొప్ప నటి అని, ఆమె దగ్గర్నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని రాజ్ కుమార్ రావు సైతం తెలపడం విశేషం. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు.. ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా, భూమి పీఈటీ టీచర్‌గా కనిపించనున్నారు.