
తెలంగాణ జానపద పాటలకు మోడర్న్ డీజే బీట్స్‌ను జోడిస్తే వచ్చే మజ్జానే వేరు. ఈమధ్య కాలంలో నెట్టింట ఫోక్ సాంగ్స్ సృష్టిస్తున్న అరాచకం గురించి చెప్పక్కర్లేదు. వారం వారం పదుల సంఖ్యలో విడుదలవుతున్న పాటలు ఊహించని విధంగా మిలియన్ వ్యూస్ అందకుంటూ దుమ్మురేపుతున్నాయి. ఇక ఆ పాటలలో వచ్చే మాస్ బీట్స్, డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ ప్రపంచాన్ని, సోషల్ మీడియా రీల్స్‌ను ఒక ఊపు ఊపేస్తున్న సరికొత్త ఫోక్ సాంగ్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణం, అచ్చమైన గ్రామీణ శైలి డ్యాన్సులు, ఇక యువత మెచ్చే డీజేలు దద్దరిల్లే బీట్స్‌తో ఉన్న ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. మొన్నటి వరకు బతుకమ్మ వేడుకలలో ఎక్కడ చూసిన ఇదే సాంగ్. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. మనం మాట్లాడుకుంటున్న పాట పేరు “బిందే మీద బిందే పెట్టి” సాంగ్.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఈ జానపద పాటకు ప్రముఖ సింగర్స్ నాగవ్వ, శ్రీనిధి తమ అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. వారి గొంతులోని మాస్ ఫోక్ టచ్ శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక సంగీత దర్శకుడు సాండీ అందించిన కిక్కిచ్చే డీజే బీట్స్ ప్రతి ఒక్కరి చేత కాళ్లు కదిలేలా చేస్తున్నాయి. తిరుపతి సాహో అందించిన క్యాచీ లిరిక్స్ పల్లెటూరి మాస్ వైబ్స్‌ను తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీకాంత్ (లీడింగ్ బాయ్స్) ఆధ్వర్యంలో రూపొందించిన కొరియోగ్రఫీ, పల్లె వాతావరణంలో వేసిన స్టెప్స్ ఈ పాటకు హైలెట్ అయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
రాఘవేందర్ గౌడ్ నిర్మాణంలో వైదిక మ్యూజిక్ బ్యానర్‌పై ఈ పాట నిర్మించారు. ఇందులో పూజ, యమున, తారక్ తదితరులు తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో యూత్‌ను ఎంతగానో అలరించారు. పెళ్లిళ్లు, పండుగలు, కాలేజీ ఈవెంట్స్ , డీజే స్పెషల్ పార్టీలలో ఈ పాట ఇప్పుడు మార్మోగిపోతోంది. యూట్యూబ్‌లో కోట్ల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ మాస్ ఫోక్ సాంగ్ జానపద ప్రియులందరి ప్లేలిస్ట్‌లో తప్పకుండా ఉంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..