న్యూస్ యాంకర్, జర్నలిస్ట్, మోడల్, యాక్టర్.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ ప్రతిభ చూపుతోంది లహరి షారి (Lahari Shari). విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లోనూ తళుక్కున మెరిసింది. ఇక బిగ్ బాస్ ఐదో సీజన్ (BiggBoss5)తో తన పాపులారిటీని మరింత పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై వరుస ఛాన్స్ లను దక్కించుకుంటోంది. కాగా ఈ ఏడాది జనవరిలో ఓ లగ్జరీ బైక్‌ను కొని వార్తల్లో నిలిచిన లహరి రెండు నెలలు తిరగకుండానే ఖరీదైన కారును కొనేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయింది.
రూ. 60 లక్షలకు పైనే..
మహాశివరాత్రిని పురస్కరించుకుని లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని కొన్ని లహరి.. ఆ కారును తనకు తాను బహుమతిగా ఇచ్చుకుంది. అనంతరం కారు ముందు స్టైల్ గా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర సుమారు రూ. 60 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఇక జనవరిలో లహరి కొనుగోలు చేసిన బీఎమ్‌డబ్ల్యూ బైక్ కూడా రూ.3-3.5 లక్షల దాకా ఉంటుంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు మ్యూజిక్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్ లో నటించింది లహరి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.