Sports Authority Jobs: ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

Sports Authority Jobs: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Sports Authority Jobs: ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Sports Authority Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2022 | 7:00 AM

Sports Authority Jobs: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ కన్సల్టెంట్‌ (02), మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ (02), మీడియా మేనేజర్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* సీనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 10-03-2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

* మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 10-03-2022 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

* మీడియా మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 10-03-2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 45,000 నుంచి రూ. లక్షన్నర వరకు జీతంగా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Central Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త..

Russia-Ukraine War: పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు

Russia Ukraine War: జేబులో షీల్డ్‌గా మారిన పాస్‌పోర్ట్.. బుల్లెట్ దాడిలో 16 ఏళ్ల బాలుడు సేఫ్!