Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీళ్లేనా.. హింట్ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్..

|

Sep 02, 2021 | 7:35 PM

Bigg Boss 5 Telugu : తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో ఏదైనా ఉంది అంటే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. ఈ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీళ్లేనా.. హింట్ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్..
Sujatha
Follow us on

Bigg Boss 5: తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో ఏదైనా ఉంది అంటే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. ఈ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 5 తో సిద్ధంగా ఉంది. మొదటి సీజన్ నుంచి భారీ టీఆర్పీతో రన్ అవుతూ వస్తుంది ఈ రియాల్టీ షో. ఇక ఇప్పుడు సీజన్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు సీజన్స్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత బిగ్ బాస్ బాధ్యతను కింగ్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. సీజన్ 3, సీజన్ 4 లను విజయవంతంగా నడిపించిన నాగ్. ఇప్పుడు ఐదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రోమో కూడా విడుదల చేశారు నిర్వాహకులు. అయితే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకు ఎవరు బిగ్ బాస్ హౌస్‌‌లోకి వెళ్తున్నారన్నదానిపైన క్లారిటీ అయితే రాలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సుజాత హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు చెప్పుకొచ్చింది.

సుజాత చెప్పిన లిస్ట్‌లో.. ముందుగా యాంకర్ రవి గురించి ప్రస్తావించింది. రవి ఎప్పుడు సరదాగా ఉంటూ అందరిని అలరిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చింది సుజాత. ఒక వేళ రవి హోస్‌లోకి వెళ్తే ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తాడని అంటుంది సుజాత. రవి మాట్లాడే విధానం బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సెకండ్ కంటెస్టెంట్‌గా యాంకర్ లోబో వెళ్లే అవకాశం ఉందని అంటుంది సుజాత. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న లోబో ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తాడని అంటుంది సుజాత. ఇక మూడో కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ.. నటి సురేఖ వాణి హౌస్‌లోకి వెళ్తున్నారని తెలిసిందని.. ఆమె తన కూతురుతో ఉండే విధానం చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చింది సుజాత. అలాగే కార్తీక దీపం సీరియల్ నుంచి నటి ఉమా దేవి హౌస్‌లోకి వెళ్తుందని అంటుంది సుజాత. ఆమె సీరియల్‌లో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుందని.. అలాగే బిగ్ బాస్ హౌస్‌లో కూడా తన మాటలతో ఆకట్టుకుంటుందని తెలిపింది సుజాత. ఇక ఐదో కంటెస్టెంట్‌‌గా సీరియల్ నటి లహరి వెళ్తుందని అంటుంది సుజాత. లహరి పలు సీరీయల్స్‌తో పాటు ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. అలాగే సీరియల్ నటి సిరి హనుమంత్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందని అంటుంది సుజాత. సిరి ఫైనల్ వరకు ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చింది సుజాత. అలాగే జబర్దస్త్ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ హౌస్‌లోకి వెళ్తుందని సమాచారం ఉందని చెప్పుకొచ్చింది సుజాత.  ప్రియాంక సింగ్ నిజంగా హౌస్‌లోకి వెళ్తే ఫైనల్ వరకు వెళ్లాలని కోరుకుంది సుజాత. అలాగే సీరియల్ నటులు  ప్రియా, నవ్య కూడా బిగ్ బాస్ హౌస్‌‌‌‌లోకి వెళ్తున్నారని అంటుంది సుజాత. అలాగే కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ కూడా బిగ్ బాస్ హౌస్‌‌లోకి వెళ్తున్నారని అంటుంది సుజాత. ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ అందరు వెళ్తున్నారని తనదగ్గర సమాచారం ఉందని వీరిలో దాదాపు 80శాతం మంది హౌస్‌లోకి వెళ్తారు అంటూ చెప్పుకొచ్చింది సుజాత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ