Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

|

Dec 20, 2021 | 5:55 AM

Bigg Boss 5 Telugu: వందకుపైగా రోజులు జరిగిన బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగిసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సన్నీ విన్నర్‌గా నిలిచాడు. ఎపిసోడ్‌ ప్రారంభంలో కాస్త తడబడిన..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..
Sunny Biggboss Winner
Follow us on

Bigg Boss 5 Telugu: వందకుపైగా రోజులు జరిగిన బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగిసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సన్నీ విన్నర్‌గా నిలిచాడు. ఎపిసోడ్‌ ప్రారంభంలో కాస్త తడబడిన సన్నీ తర్వాత ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల అభిమానాన్ని పెంచుకుంటూ పోయాడు. అలవోకగా టాప్‌ 5లో నిలిచి ఎక్కడా తగ్గకుండా టైటిల్‌ లక్ష్యంగా తన గేమ్‌ ప్లాన్‌ను మార్చుకుంటూ దూసుకెళ్లాడు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకొని బిగ్‌బాస్‌ విన్నర్‌ టైటిల్‌ను కొట్టేశాడు. ఇలా లక్షలాది మంది తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు సన్నీ. ఇక కేవలం అభిమానుల ప్రేమను మాత్రమే కాకుండా బిగ్‌బాస్‌ షో ద్వారా సన్నీ భారీ మొత్తాన్నే అందుకున్నాడు.

ఇన్ని రోజుల పాటు బిగ్‌బాస్‌ షోలో ఉన్న రెమ్యునరేషన్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకున్నందుకుగాను రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీకి సంబంధించి చెక్‌ను నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక అంతేకాకుండా సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ తరఫున షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు టీవీఎస్‌ కంపెనీకి చెందిన బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే సన్నీకి బిగ్‌బాస్‌ ఎంత కాదన్నా రూ. కోటికిపైగే ముట్ట చెప్పాడన్నమాట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ట్యాలెంట్‌తో ఇంకా ఎంతో సాధిస్తానని, తన తల్లికి బిగ్‌బాస్‌ ట్రోఫీలాంటి ఇంకా ఎన్నో బరువులు మోయాల్సి ఉంటుందని ఎంతో ధీమాగా చెప్పిన సన్నీ మరి ఏమేర సక్సెస్‌ అవుతాడో చూడాలి.

Also Read: IRCTC Tour Package: కొత్త సంవత్సరంలో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే 4 రోజుల IRCTC సూపర్ ప్యాకేజీ ట్రై చేయండి..

Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ ఇబ్బంది తప్పనిసరి అంటున్న శాస్త్రవేత్తలు..