Bigg Boss 5 Telugu: హౌజ్‌లో రచ్చ చేసిన ప్రియాంక, లోబో, జెస్సీ.. అదేంటి వీళ్లు ఎలిమినేట్‌ అయ్యారనేగా..

|

Dec 07, 2021 | 6:32 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజయవంతగా కొనసాగుతోంది. షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఆసక్తికరంగా మారుతోంది. 13 వారాలుగా కొనసాగుతోన్న ఈ షోలో ప్రస్తుతం కేవలం...

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో రచ్చ చేసిన ప్రియాంక, లోబో, జెస్సీ.. అదేంటి వీళ్లు ఎలిమినేట్‌ అయ్యారనేగా..
Biggboss 5 Telugu Promo
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజయవంతగా కొనసాగుతోంది. షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఆసక్తికరంగా మారుతోంది. 13 వారాలుగా కొనసాగుతోన్న ఈ షోలో ప్రస్తుతం కేవలం 6 గురు మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. దీంతో ఈ ఆదివారం టాప్‌ 5లో ఎవరు నిలుస్తారో తెలిసిపోనుంది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పటికే శ్రీరామ్‌ ఫైనలిస్ట్‌లో ఒకరిగా చోటు దక్కిచ్చుకోగా మిగతా వారు ఎలిమినేషన్‌లో ఉన్నారు. దీంతో తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిలో ఉన్న సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రేంజ్‌ను పెంచే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగా ‘రోల్‌ప్లే’ అనే ఫన్నీ టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రియాంక, లోబో, జెస్సీలు ఎలా ప్రవరిస్తారో హౌజ్‌లో ఉన్న వారిని చేసి చూపించారు. ఇందులో భాగంగా మానస్‌ .. ప్రియాంకలా మారాడు. శ్రీరామ్‌ లోబోలా మారి రచ్చ రచ్చ చేశాడు. అలాగే షణ్ముఖ్‌ జెస్సీ అవతారమెత్తగా, సన్నీ మానస్‌లా మారిపోయాడు. ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలను మరొకరిలా మార్చుకొని సందడి చేశారు.

ఈ క్రమంలో షణ్ముఖ్‌ సిరిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. అంతా ఫన్నీగా సాగుతోందనుకుంటున్న సమయంలో సన్నీ కొంచెం సీరియస్‌గా అయ్యాడు. మరి సన్నీ నిజంగానే సీరియస్‌ అయ్యాడా.? అందులో కామెడీ చేశాడా.? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: AP Crime News: 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రావట్లేదని ఎస్‌ఐ ఆత్మహత్య.. మద్యంలో పురుగుల మందు కలుపుకొని..

PM Modi: ‘రెడ్ క్యాప్‌లు’ యూపీకి రెడ్ అలర్ట్‌లాంటివి.. సమాజ్‌వాదీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Big News Big Debate: భువనేశ్వరికి వంశీ ఎందుకు క్షమాపణ చెప్పారు.. అసలు ఆ రోజు బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో ఏం జరిగింది..