Bigg Boss 5 Telugu : ఈ గ్యాప్ లేకుండా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5

|

Jan 27, 2021 | 4:37 PM

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అనంతరం దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న షో బిగ్ బాస్.. తెలుగు లో ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. దీంతో అందరి చూపు నెక్స్ట్ సీజన్ గురించే...

Bigg Boss 5 Telugu : ఈ గ్యాప్ లేకుండా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5
Follow us on

Bigg Boss 5 Telugu: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అనంతరం దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న షో బిగ్ బాస్.. తెలుగు లో ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. దీంతో అందరి చూపు నెక్స్ట్ సీజన్ గురించే. నిజానికి సీజన్ 3 కి సీజన్ 4 కి మధ్య కరోనా కారణంతో చాలా గ్యాప్ వచ్చింది.. కానీ ఈసారి అంత గ్యాప్ లేకుండా సీజన్ 5 ను బుల్లితెర ప్రేక్షకులకు అందించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాది మే తర్వాత ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారని సమాచారం. ఇప్పటికే హౌస్ లో పార్టిసిపెంట్ చేసే కంటెస్టుల వేటలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సీనియర్ యాక్టర్స్ తో పాటు జబర్దస్త్ , ఢీ వంటి షోలో పార్టిసిపేంట్స్ కు అవకాశాలు దక్కనున్నాయని బుల్లితెర వర్గాల టాక్.. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారిని సొహైల్ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లో రాహుల్ అందరిని ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు సోహెల్ కు ఈ ఛాన్స్ దక్కనున్నదని సమాచారం.

Also Read: గత 30 ఏళ్ల కంటే వేగంగా కరుగుతున్న మంచు.. మానవాళికి ప్రకృతి సరికొత్త హెచ్చరికను జారీ చేసిందా..!