తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌కు విన్నర్‌గా గెలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజేత రాహుల్‌కు రూ.50లక్షలతో పాటు ట్రోపీని అందించారు. ఇక మిగిలిన రెమ్యునరేషన్‌తో కలిపి రాహుల్‌కు బిగ్‌బాస్ నుంచి రూ.80వరకు ముట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజేతలుగా నిలవనప్పటికీ.. ఈ సీజన్‌లో ఇద్దరికి మాత్రం రాహుల్ కంటే ఎక్కువ అమౌంట్ ముట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్‌తో పాటు ఫైనల్ వరకు ఉన్న వరుణ్ సందేశ్, శ్రీముఖిలకు అత్యధిక పారితోషికం అందినట్లు టాక్.
యాంకర్‌గా శ్రీముఖికి క్రేజ్ చాలా ఉంది. పలు ఛానెల్‌లలో ఆమె కొన్ని ప్రోగ్రామ్‌లకు హోస్ట్‌గా చేసేది. అలాగే సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించేది. ఇక వాటన్నింటిని వదులుకొని వంద రోజులకు పైగా హౌస్‌లో ఉన్న శ్రీముఖికి రన్నరప్ అమౌంట్ రూ.15లక్షలు, డైలీ రెమ్యునరేషన్‌తో కలుపుకొని దాదాపు రూ.కోటి దాకా ముట్టినట్లు టాక్. అలాగే వరుణ్ సందేశ్‌కు కూడా ఎక్కువ డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. తన భార్య వితికాతో కలిసి వరుణ్ ఈ సీజన్‌లో పాల్గొన్నాడు. భార్య అమౌంట్‌ను పక్కన పెడితే.. వరుణ్‌కు కూడా కోటి దాకా బిగ్‌బాస్ ద్వారా వచ్చినట్లు సమాచారం. మొత్తానికి విన్నర్‌లుగా నిలవనప్పటికీ.. ఈ ఇద్దరు విజేతకు వచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే తమ ఖాతాలో వేసుకున్నారని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విధంగానే గత సీజన్‌లో కూడా విన్నర్ కౌశల్ కంటే రన్నరప్ గీతామాధురికే ఎక్కువ అమౌంట్ వచ్చినట్లు పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే.