AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10: ఇలా ఉన్నారేంట్రా.. టాస్క్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. విల విలలాడిన లేడీ కంటెస్టెంట్..

బుల్లితెరపై అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మొదలైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ టాస్కులో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Bigg Boss 10: ఇలా ఉన్నారేంట్రా.. టాస్క్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. విల విలలాడిన లేడీ కంటెస్టెంట్..
Bigg Boss 10 Tamil
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2026 | 1:21 PM

Share

బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో సైతం ఈ షో ప్రారంభమైంది. సాధారణంగా బిగ్ బాస్ షోలో టాస్కులలో కంటెస్టెంట్స్ పోటీపడడం కామన్. కొన్ని సందర్భాల్లో ఆట శ్రుతి మించినప్పటికీ ఎలాంటి గాయాలు తగలకుండా ఆడాలని హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 10లో ఓ టాస్కులో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. గత సీజన్లలో రాత్రిపూట కంటెస్టెంట్లు నిద్రపోవడం లేదా మాట్లాడుకోవడం మాత్రమే చూపించేవారు. అటువంటి వాతావరణంలో, రాత్రిపూట చూసే ప్రేక్షకులకు కూడా కంటెంట్ అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ 10వ సీజన్‌లో ‘నైట్ టాస్క్’ అనే దానిని ప్రవేశపెట్టాలని టీమ్ నిర్ణయించింది. ఆ టాస్క్‌లో పాల్గొనే కంటెస్టెంట్లకు, రాత్రంతా నిద్రపోకుండా వినోదాత్మకంగా ఏదైనా చేయమని సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

అయితే తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఓ ఫైనల్ టాస్కులో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఒకరినొకరు తోసుకుంటూ బీభత్సం సృష్టించారు. నిన్న జరిగిన ఓ టాస్కుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో రే టీంకు చెందిన లక్ష్మీ ప్రియ, ఆనందిల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే ఇందులో ఓ కంటెంస్టెంట్ విపుపై మరో కంటెస్టెంట్ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను తోటి కంటెస్టెంట్స్ హౌస్ లోకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఇలా కొట్టుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

బిగ్ బాస్ టాస్క్ .

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us