Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5లో ఒక్కో వారం గడుస్తున్నా కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 5 వారాలు ముగిశాయి. ఈ క్రమంలో 19 మందితో మొదలైన షోలో 5గురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తాజాగా హమీదా ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేసిన హమీదా ఎలిమినేట్ కావడంతో అందరూ నిరూత్సాహపడ్డారు. ఇదిలా ఉంటే హమీదా ఎందుకు ఎలిమినేషన్‌కు గురైందన్న దానిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హమీదా ఒక్క వ్యక్తి కోసం బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న వారందరినీ దూరం పెట్టడమే ఆమెకు మైనస్‌గా మారిందని ఆ కారణంగానే ఎలిమినేషన్‌కు గురైంది అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంపై హమీదా ఎట్టకేలకు స్పందించింది. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హమీదా. శ్రీరామచంద్రతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్లే తాను టాస్క్‌లపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయానని.. అందువల్లే తాను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. అయితే శ్రీరామచంద్ర తాను ప్రేమికులం కాదని చెప్పిన హమీదా.. తమ మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉందని తెలిపింది.
హమీదా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నానో అది శ్రీరామ్ దగ్గర నుంచి నాకు లభించింది. శ్రీరామ్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.. ఇద్దరు అన్ని విషయాలను షేర్ చేసుకునేవాళ్లం’అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చే ముందు రోజు రాత్రి కూడా శ్రీరామ్‌తో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోయానని చెప్పిన హమీదా కన్నీరు పెట్టుకుంది.
Fruit Prices: నవరాత్రుల సందర్భంగా పెరిగిన పండ్ల ధరలు.. కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..
Dry Grapes Benefits: ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో