నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాగా.. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వెంకీ కుడుముల మరోసారి తన దర్శకత్వంతో ఆకట్టుకోగా.. నితిన్‌కు ఇది మంచి కమ్‌బ్యాక్ అని సినీ విశ్లేషకులు కామెంట్లు పెడుతున్నారు. కాగా వెంకీ కుడుములపై యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
వెంకీ కుడుముల తనను చీట్ చేశారని, దర్శకుడిగా అతడి ఎంట్రీకి తమ బ్యానర్‌లో అవకాశం ఇస్తే.. ఛలో తరువాత అతడు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని నాగశౌర్య అన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తన ఫోన్‌ను వెంకీ రిసీవ్ చేసుకోలేదని.. కొన్ని రోజుల తరువాత సిమ్ కూడా మార్చేశాడని నాగశౌర్య ఆరోపించారు. భవిష్యత్‌లో అవకాశం వచ్చినా.. వెంకీ దర్శకత్వంలో తాను నటించనని కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. అలాగే ఛలో హిట్ తరువాత వెంకీకి, తన తల్లి కారు గిఫ్ట్‌గా ఇస్తే.. దాన్ని కూడా అమ్మేశాడని ఆ హీరో కామెంట్లు చేశారు. అతడి తీరుపై తన తల్లి కూడా చాలా బాధపడ్డారని నాగశౌర్య చెప్పుకొచ్చారు. ఇక వీటిపై అప్పుడు ఏ మాత్రం స్పందించిన వెంకీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘ఇది ప్రైవేట్ మ్యాటర్. నా విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు, సాధారణ ప్రజలు అంత ఆసక్తిని చూపరని అనుకుంటున్నా’’ అని వెంకీ చెప్పుకొచ్చారు. అలాగే తన మొదటి చిత్రంకు వచ్చిన గిఫ్ట్‌ను తాను ఎందుకు అమ్ముకుంటానని. ఆ కారు ఇప్పటికీ తన దగ్గరే ఉందని స్పష్టం చేశారు. దీనిపై మరింత కాంట్రవర్సీ చేయాలని తాను అనుకోవడం లేదని అన్నారు. మరి వీరిద్దరి మధ్య చెడటానికి గల అసలు కారణమేంటో..! ఆ దేవుడికే తెలియాలి.
Read This Story Also:‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు..!