‘జబర్దస్త్’ మానేసింది అందుకే: షకలక శంకర్

| Edited By:

Jul 29, 2019 | 5:57 PM

‘షకలక శంకర్’ బుల్లితెరపై పరిచయం లేని వ్యక్తి. తన భాష, యాసతో జనాలను కడుబుబ్బా నవ్వించగలిగాడు. శంకర్ వస్తే చాలు.. మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చని జనాలు సైతం అభిప్రాయపడ్డారు. కాగా.. శంకర్‌కు.. పవన్ కళ్యాణ్ భక్తుడిగా కూడా సెపరేట్ ఇమేజ్ ఉంది. చలాకీ చంటీ టీంతో ఎంట్రీ ఇచ్చిన శంకర్.. కామెడీని గమ్యంగా చేసుకుని, పంచ్‌లను దానికి మార్గంలా వేసుకుని పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో నవ్వులు పంచాడు. కాగా.. ఇప్పుడు శంకర్ బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై మళ్లీ కనువిందు చేయడానికి […]

జబర్దస్త్ మానేసింది అందుకే: షకలక శంకర్
Follow us on

‘షకలక శంకర్’ బుల్లితెరపై పరిచయం లేని వ్యక్తి. తన భాష, యాసతో జనాలను కడుబుబ్బా నవ్వించగలిగాడు. శంకర్ వస్తే చాలు.. మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చని జనాలు సైతం అభిప్రాయపడ్డారు. కాగా.. శంకర్‌కు.. పవన్ కళ్యాణ్ భక్తుడిగా కూడా సెపరేట్ ఇమేజ్ ఉంది. చలాకీ చంటీ టీంతో ఎంట్రీ ఇచ్చిన శంకర్.. కామెడీని గమ్యంగా చేసుకుని, పంచ్‌లను దానికి మార్గంలా వేసుకుని పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో నవ్వులు పంచాడు. కాగా.. ఇప్పుడు శంకర్ బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై మళ్లీ కనువిందు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదివరకే ఒక సినిమా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. ‘శంభో శంకర’ సినిమా.. డిజాస్టర్‌గా మారింది.

అయితే.. శంకర్ ‘జబర్దస్త్’ మానేయడానికి కారణాలు ఏంటని.. ప్రశ్నించగా.. విచిత్రమైన సమాధానం చెప్పాడు. తనను టీం లీడర్ చేసిన తరువాత.. కొత్త స్కిట్స్‌తో ట్రై చేశానన్నాడు. అవి ఎవరికీ అర్థంకాలేదని.. పాతవి రీమేక్ చేస్తే.. ఏంటి..? శంకర్ మళ్లీ చేసినవే చేస్తున్నావ్ అని అన్నారు. అందుకే.. దీంతో.. అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. అయినా.. నేను ఏం చేద్దామని వచ్చానో అవన్నీ చేశానని.. అనుకున్నది సాధించానని.. జనాలు కూడా గుర్తుంచుకున్నారని చెప్పాడు. అయితే.. నాతో చేసిన వాళ్లు ఇప్పటికీ చేస్తున్నారంటే అదివాళ్ల టాలెంట్‌ అని.. నాలో మ్యాటర్ అయిపోయిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ఇప్పుడు కొత్త సినిమాలు చేయడానికి ఒప్పుకున్నానని.. ఆ విషయాలు త్వరలోనే వివరిస్తానని తెలిపాడు షకలక శంకర్.