Balagam movie: బలగానికి పెరుగుతోన్న ఆదరణ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న ఫీల్‌ గుడ్‌ మూవీ.

ఏ ఇద్దరు కలిసి ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకున్నా బలగం సినిమా ప్రస్తావన తప్పకుండా రావాల్సిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. పల్లెటూరు పచ్చదాన్ని, మనుషుల మధ్య ఉండే సంబంధబాంధవ్యాలను తెరపై అద్భుతంగా ఆవిషృతమైన సినిమా..

Balagam movie: బలగానికి పెరుగుతోన్న ఆదరణ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న ఫీల్‌ గుడ్‌ మూవీ.
Balgam Movie

Updated on: Mar 30, 2023 | 7:52 PM

ఏ ఇద్దరు కలిసి ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకున్నా బలగం సినిమా ప్రస్తావన తప్పకుండా రావాల్సిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. పల్లెటూరు పచ్చదాన్ని, మనుషుల మధ్య ఉండే సంబంధబాంధవ్యాలను తెరపై అద్భుతంగా ఆవిషృతమైన సినిమా బలగం. దర్శకుడు వేణు తన అద్భుత పనితీరుతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. బంధాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేటి సమాజంలో మరోసారి మన మూలాలను పరిచయం చేసిన బలగానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.

చిన్న సినిమాగా విడుదలై థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ప్రేక్షకుల మనుసును దోచుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటోంది. తాజాగా బలగానికి లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం, బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఈమేరకు లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ విభాగం సర్టిఫికెట్స్‌ కూడా జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘నా బలగం చిత్రానికి మూడో అవార్డు.. బలగం గ్లోబల్‌ లెవల్‌లో కూడా మెరుస్తోంది’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..