‘రాములో రాముల’కు అల్లు అర్హ ‘దోస స్టెప్’.. మీరు చూశారా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌కు తన పిల్లలు అయాన్, అర్హ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని బయటికి పెద్దగా తీసుకురానప్పటికీ.. వారితో తాను చేసిన అల్లరి వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు బన్నీ. ఇలా వారికి కూడా ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా అర్హకు, అల్లు అర్జున్‌కు మధ్య జరిగిన కన్వర్జేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో బన్నీ, అర్హను నాన్న సినిమా […]

రాములో రాములకు అల్లు అర్హ దోస స్టెప్.. మీరు చూశారా..!

Edited By:

Updated on: Jan 03, 2020 | 4:19 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌కు తన పిల్లలు అయాన్, అర్హ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని బయటికి పెద్దగా తీసుకురానప్పటికీ.. వారితో తాను చేసిన అల్లరి వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు బన్నీ. ఇలా వారికి కూడా ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా అర్హకు, అల్లు అర్జున్‌కు మధ్య జరిగిన కన్వర్జేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో బన్నీ, అర్హను నాన్న సినిమా పేరేంటి అని అడగ్గా.. అల వైకుంఠపురములో అని చెప్తుంది. ఆ తరువాత అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని సాంగ్ చేస్తాడు కదా అది ఏ సాంగ్ అని బన్నీ అడగ్గా.. రాములో రాముల అని అంటుంది అర్హ. ఇక అందులో ఏ స్టెప్ చేస్తాను అంటూ బన్నీ ప్రశ్నించగా.. దోసె స్టెప్ అంటూ క్యూట్‌గా చెప్పిన అర్హ.. ఇలా మొత్తం తిప్పి, ఫాస్ట్‌గా తిప్పుతావు అంటూ రాములో రాముల స్టెప్‌ను చూపిస్తుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ “వావ్ నైస్.. క్యూట్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా అల వైకుంఠపురములోని ‘ఓ మై గాడ్ డాడీ’ అనే పాటకు అయాన్, అర్హ స్టెప్‌లు వేయగా.. ఆ వీడియో కూడా ఆ మధ్యన వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదలా ఉంటే అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బన్నీ సరసన పూాజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, రావు రమేష్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, పాటలతో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.