బాలీవుడ్‌ నన్ను సైడ్‌ చేస్తోంది.. రెహమాన్‌ సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌పై ఆస్కార్‌ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజండ్‌ ఏఆర్ రెహమాన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ జనాలు తనను సైడ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బాలీవుడ్‌ నన్ను సైడ్‌ చేస్తోంది.. రెహమాన్‌ సంచలన ఆరోపణలు

Edited By:

Updated on: Jul 25, 2020 | 3:25 PM

AR Rahman: బాలీవుడ్‌పై ఆస్కార్‌ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజండ్‌ ఏఆర్ రెహమాన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ జనాలు తనను సైడ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓ రేడియో ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. సినిమాలు తన వరకు రాకుండా కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ ప్రచారం చేస్తోందని రెహమాన్ తెలిపారు. సమయానికి స్వరాలు ఇవ్వరనే ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు

భగవంతుడిని నమ్ముతానని, తన వరకు వచ్చిన సినిమాలను చేస్తానని సంగీత దిగ్గజం తెలిపారు. ఈ సందర్భంగా దిల్‌ బేచారా దర్శకుడు ముఖేష్ చబ్రా మాట్లాడుతూ.. రెహ‌మాన్ ద‌గ్గ‌రికి వెళ్లొద్ద‌ని బాలీవుడ్‌లో తనకు పలువురు చెప్పారని అన్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. నెపోటిజం వలనే సుశాంత్‌ను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫ్యాన్స్ ఆరోపించారు. వారి ఆరోపణలపై పలువురు సినీ ప్రముఖులు సైతం మద్దతు తెలిపారు. అంతేకాదు కొందరు నటీనటులు ముందుకొచ్చి.. తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా బాలీవుడ్‌పై కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.