ప్రభాస్, అనుష్క.. ఈ పెయిర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా మూవీతో మొదటిసారిగా జోడీ కట్టిన ఈ జంట ఆ తరువాత మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాల్లో కలిసి నటించారు. ఈ అన్ని చిత్రాల్లో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బావుంటుందని ఇద్దరి ఫ్యాన్స్ తమ మనసులోని మాటను పలుమార్లు బయటపెడుతూనే వస్తున్నారు. అంతేకాదు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఇదిలా ఉంటే ప్రభాస్‌తో తనకు గల సంబంధంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు అనుష్క.
నాకు 15 సంవత్సరాలుగా ప్రభాస్ తెలుసు. ఎలాంటి సమయంలోనైనా ఆయనతో మాట్లాడగల సాన్నిహిత్యం ఉంది. సినిమాలల్లో మా ఇద్దరి జోడీకి మంచి మార్కులు పడటంతో.. బయట కూడా ఇద్దరిపై రూమర్లు వచ్చాయి. ఒకవేళ నిజంగానే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే.. ఈ సమయానికి బయటపడేది. ఇంకా చెప్పాలంటే మా ఇద్దరి మనస్తత్వం ఒకటే. ఇద్దరికీ భావోద్వేగాలు ఎక్కువ” అని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్‌తో పాటు ఇండస్ట్రీలో నాని, రానా, సుప్రియ యార్లగడ్డ, ప్రశాంతి, వంశీ-ప్రమోద్(యూవీ క్రియేషన్స్), రాజమౌళి కుటుంబం.. వీరందరితో తాను సన్నిహితంగా ఉంటానని ఆమె తెలిపారు. కాగా హేమంత్ దర్శకత్వంలో అనుష్క నిశ్శబ్దం అనే చిత్రంలో నటించగా.. ఏప్రిల్ 2న విడుదల తేదీని ఫిక్స్ చేశారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: గీత మేడంకు ఏమైంది..? ప్లీజ్ కమ్ బ్యాక్ రష్మిక..!