‘మహా సముద్రం’లో చేరిన అను ఇమ్మాన్యుల్‌

శర్వానంద్‌, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితీ రావు హైదరీ కన్ఫర్మ్ అయ్యారు

'మహా సముద్రం'లో చేరిన అను ఇమ్మాన్యుల్‌

Anu Emmanuel Maha Samudram: శర్వానంద్‌, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితీ రావు హైదరీ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇందులో మరో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుల్‌ కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఉందని, అజయ్ భూపతి అద్భుతంగా స్క్రిప్ట్ రాశారని ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో విలక్షణ నటుడు జగపతి బాబు కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

వైభవంగా జరిగిన సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్‌

ఒప్పుకున్న చిరు.. ఊపిరి పీల్చుకున్న దర్శకుడు..!

Click on your DTH Provider to Add TV9 Telugu