మరో సెన్సేషనల్ డైరెక్టర్‌ని లాక్ చేసుకున్న మైత్రీ సంస్థ!

ఇండస్ట్రీల్లోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

మరో సెన్సేషనల్ డైరెక్టర్‌ని లాక్ చేసుకున్న మైత్రీ సంస్థ!

Edited By:

Updated on: Aug 04, 2020 | 3:49 PM

Mythri Movie Makers locked another director: ఇండస్ట్రీల్లోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.  ఈ సంస్థ ఇప్పటికే కొరటాల, సుకుమార్‌, విక్రమ్ కుమార్‌ వంటి పలువురు సెన్సేషనల్‌ డైరెక్టర్‌లతో పనిచేసింది. అంతేకాదు పవన్‌ కోసం హరీష్ శంకర్‌, మహేష్‌ కోసం పరశురామ్‌, ఎన్టీఆర్ కోసం ప్రశాంత్‌ నీల్‌లను లాక్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సంస్థ మరో సెన్సేషనల్ దర్శకుడిని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కార్తీ హీరోగా ‘ఖైదీ’ని తెరకెక్కించిన లోకేష్‌ కనగరాజుతో మైత్రీ సంస్థ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా ఈ దర్శకుడు మాస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ను జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ తరువాత ఓ తెలుగు-తమిళ్‌ బైలింగ్వుల్‌ కోసం లోకేష్ కనగరాజును మైత్రీ సంస్థ లాక్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంత..? మైత్రీ నిర్మాణంలో లోకేష్ కనగరాజు ఏ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read This Story Also: రెండు చైనా యాప్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం